Srinagar Encounter: జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో మరోసారి ఉగ్రమూకలు అలజడి రేపాయి. రంగంలోకి దిగిన జమ్మూకాశ్మీర్ పోలీసులు మరియు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) శ్రీనగర్‌లో సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని కాశ్మీర్ విభాగం పోలీసులు అధికారికంగా వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీనగర్‌లోని డన్మార్ ప్రాంతాలో ఉగ్రవాదుల కదలిక సమాచారంతో జమ్మూకాశ్మీర్ పోలీసులు మరియు సీఆర్పీఎఫ్ రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో శుక్రవారం వేకువజామున ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్విట్టర్‌లో వెల్లడించారు. మరిన్ని వివరాలు త్వరలోనే అందిస్తామని పేర్కొన్నారు. శ్రీనగర్‌లోని డన్మార్, అలందార్ కాలనీలో ఎన్‌కౌంటర్ మొదలైంది. పోలీసులు మరియు భద్రతా బలగాలు ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరుపుతున్నారని ట్విట్టర్‌లో తెలిపారు. 


Also Read: WhatsApp Blocked Accounts: ఇండియాలో 2 మిలియన్ల వాట్సాప్ యూజర్ల అకౌంట్స్ బ్లాక్



ఉగ్రమూకల కదలికల సమాచారంతో పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసుల ఎదురుకాల్పుల్లో డన్మార్ ప్రాంతంలో ఓ ఉగ్రవాది, ఈద్ఘా ప్రాంతంలో మరో ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదుల కోసం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా బలగాలపై కాల్పులకు తెగబడ్డారని, వెంటనే స్పందించిన పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు ఎదురుకాల్పులు జరిపి ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుపెట్టారు. కాశ్మీర్ లోయలో గత 15 రోజులలో ఇది 7వ ఎన్‌కౌంటర్ కాగా, ఈ కేంద్రపాలిత ప్రాంతంలో 91 మంది ఉగ్రవాదులు హతమయ్యారని పోలీస్ రికార్డులు చెబుతున్నాయి.


Also Read: Nandigram Election: నందిగ్రామ్ ఎన్నికలపై మమతా బెనర్జీ పిటీషన్ విచారణ ఆగస్టు 12వ తేదీన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook