UNESCO Creative Cities Network: యునెస్కో సృజనాత్మక నగరాల నెట్‌వర్క్‌(UNESCO Creative Cities Network)లో జమ్ముకశ్మీర్ వేసవి రాజధాని  శ్రీనగర్‌(Srinagar)కు చోటు దక్కింది. దీంతో శ్రీనగర్ కు ప్రపంచస్థాయి గుర్తింపు లభించినట్లయింది. ప్రపంచంలో ఇలాంటి 49 నగరాలను దీనిలో కొత్తగా చేర్చారు. దీంతో 90 దేశాల్లో సృజనాత్మక నగరాల సంఖ్య 295కి చేరింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Delhi Air Pollution Today: ఢిల్లీలో మరింతగా పెరిగిన వాయు కాలుష్యం.. ప్రమాదకర స్థాయికి సూచీ


శ్రీనగర్‌తో పాటు గ్వాలియర్‌(Gwalior‌)ను జాబితాలో చేర్చాలని 'యునెస్కో(UNESCO)తో సహకారానికి భారత జాతీయ కమిషన్‌' గతంలో సిఫార్సు చేసింది. దీనిలో శ్రీనగర్‌కే అవకాశం దక్కింది.దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) స్పందించారు. సాంస్కృతిక, నైతికతకు నెలవైన శ్రీనగర్​కు సరైన గౌరవం దక్కిందని అన్నారు.


"ఎంతో అందమైన శ్రీనగర్.. జానపద కళలు, చేతివృత్తులు వంటి ప్రత్యేక కళలతో యునెస్కో ప్రకటించిన క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్ జాబితాలో చోటుదక్కించుకోవడం ఆనందంగా ఉంది. ఇది శ్రీనగర్​కు సాంస్కృతిక పరంగా మంచి గుర్తింపు. జమ్ముకశ్మీర్ ప్రజలకు అభినందనలు."-నరేంద్ర మోదీ, ప్రధాని



ఇలాంటి గౌరవమే భారత్​లో మరో రెండు నగరాలకు ఇదివరకే దక్కినట్లు దిల్లీ(Delhi)లోని యునెస్కో ప్రధాన కార్యాలయం తెలిపింది. 2019లో ముంబయి యునెస్కో సిటీ ఆఫ్ ఫిల్మ్​గా.. హైదరాబాద్​ యునెస్కో సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ నగరాలుగా చోటు దక్కించుకున్నాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook