Srisailam Reservoir: తెరుచుకున్న శ్రీశైలం జలాశయ క్రస్ట్ గేట్లు .. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. వీడియో వైరల్..
Srisailam Reservoir: కొన్నిరోజులుగా రుతుపవనాల ప్రభావంతో దేశంలో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులున్ని నిండుకుండలా మారాయి. శ్రీ శైలం రిజర్వాయర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.
srisailam reservoir crust gates open video goes viral: దేశంలో రుతుపవనాలు జోరుగా విస్తరించాయి. దీంతో పాటు ఉపరితల ఆవర్తనం కూడా తోడుకావడంతో దేశంలో భారీగా వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో భారీగా వర్షాలు పడుతున్నాయి. అదే విధంగా ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో కృష్ణమ్మకు వరద పోటెత్తింది. దీంతో జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చిచేరుతుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. భారీ ఎత్తున నీరు వస్తుండటంతో ప్రాజెక్టు పూర్తిగా నిండి పోయింది. ఈ క్రమంలో అధికారులు.. సోమవారం అధికారులు మూడు క్రస్ట్ గేట్లు ఎత్తి నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేశారు.
తొలుత అధికారులు.. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కానీ, వరద ప్రవాహం ఏమాత్రం తగ్గకపోవడంతో.. ముందుగానే నీటిని విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో ఉన్న ప్రాంతాలలో అధికారులు అప్రమత్తం చేశారు. ప్రాజెక్టులోకి చేపల వేటకోసం వెళ్లే..మత్స్యకారులను అప్రమత్తం చేశారు. కాగా, ప్రస్తుతం జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయానికి 4,36,433 క్యూసెక్కుల వరద వస్తుండగా, 62,857 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 878.70 అడుగులకు చేరుకుంది.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం.. గరిష్ఠ నీటినిల్వ 215.8070 టీఎంసీలకుగాను ఇప్పుడు 179.8625 టీఎంసీలకు చేరుకుంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కరెంటు ఉత్పత్తి కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టుకు 3.5 లక్ష క్యూసెక్కుల వరద వస్తుండగా 41 గేట్ల ద్వారా 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 317.73 మీటర్లు. జలాశయంలో ఇప్పుడు 5.42 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
ఒక్కొ గేటు నుంచి 27 వేల క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నట్ల తెలుస్తోంది.6,7,8 గేట్లను ఎత్తడం ద్వారా..మొత్తంగా 81 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. దీంతో కృష్ణమ్మ ఉరకలెత్తుకుంటూ ప్రవహిస్తుంది. ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో నీటి ప్రవాహనంను చూడటానికి పర్యాటకులు భారీ ఎత్తున తరలివస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter