SSC CGL 2020 Recruitment: 6 వేలకు పైగా ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకున్నారా!
కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో అతిపెద్ద నోటిఫికేషన్ వచ్చేసింది. నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్త చెప్పింది. గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే `కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్-2020` నోటిఫికేషన్‌ను ఎస్ఎస్‌సీ విడుదల చేసింది. మొత్తం 6,506 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైంది.
SSC CGL 2020 Recruitment: కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో అతిపెద్ద నోటిఫికేషన్ వచ్చేసింది. నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్త చెప్పింది. గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్-2020' నోటిఫికేషన్‌ను ఎస్ఎస్‌సీ విడుదల చేసింది. మొత్తం 6,506 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైంది.
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు(Jobs 2020) దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. మొత్తం 4 దశలు పూర్తి అయ్యాక అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. గ్రూప్ బి గెజిటెడ్, నాన్ గెజిటెడ్, గ్రూప్ సి పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 2న ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ.
Also Read: Hyderabad Jobs: హైదరాబాద్ ఎంఎస్ఎంఈలో జాబ్స్.. అప్లై చేసుకున్నారా!
మొత్తం పోస్టులు: 6,506
1) గ్రూప్-బి గెజిటెడ్: 250 పోస్టులు
2) గ్రూప్-బి నాన్ గెజిటెడ్: 3513 పోస్టులు
3) గ్రూప్-సి: 2743 పోస్టులు
అప్పర్ డివిజన్ క్లర్క్ నుంచి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వరకు పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆయా పోస్టులను ఆధారంగా డిగ్రీలో స్పెషలైజేషన్ విద్యార్హతను నిర్ణయించారు.
జనవరి 1, 2021 నాటికి కొన్ని పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల వయసు, కొన్ని పోస్టులకు 20 నుంచి 27 ఏళ్లు మధ్య, మరికొన్ని పోస్టులకు 30-32 ఏళ్లు గరిష్ట వయసుగా నిర్ణయించారు.
Also Read: Job Tips: మీరు ఇలా చేస్తున్నారా.. అయితే జాబ్ మారాల్సిందే!
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం డిసెంబర్ 29, 2020
దరఖాస్తుల చివరి తేదీ జనవరి 31, 2021
ఆన్‌లైన్ పేమెంట్ చివరి తేది ఫిబ్రవరి 2, 2021
ఆఫ్‌లైన్ పేమెంట్ చివరి తేది ఫిబ్రవరి 4, 2021
తొలుత టైర్1 పరీక్ష మే 29 నుంచి జూన్ 7, 2021 వరకు నిర్వహిస్తారు.
ఆ తర్వాత ఫలితాల ఆధారంగా టైర్ 2, టైర్ 3 మరియు టైర్ 4 ప్రక్రియ ఉంటుంది
SSC CGL Examination 2020 నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి
Online Application SSC CGL 2020 కోసం క్లిక్ చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook