ఈ 24 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు మెడికల్ టెస్టులు
కానిస్టేబుల్ ఎంపికకు సంబంధించిన మెడికల్ ఎగ్జామినేషన్ తేదీల (SSC Constable Medical Exam Schedule)ను రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 10 వరకు మెడికల్ టెస్టులు నిర్వహించనున్నారు.
కానిస్టేబుల్ ఎంపికకు సంబంధించిన మెడికల్ ఎగ్జామినేషన్ తేదీలను రిక్రూట్‌మెంట్ బోర్డు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission) విడుదల చేసింది. సీఆర్పీఎఫ్, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్ విభాగాలలో ఖాళీగా ఉన్న 1,724 కానిస్టేబుల్, రైఫిల్‌మెన్ పోస్టులకుగానూ ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 10 వరకు మెడికల్ టెస్టులు (SSC Constable 2018 medical exam schedule) నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎస్ఎస్‌సీ (SSC) అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపరిచారు. VVS Laxman: ‘రిటైర్మెంట్‌పై ధోనీ 2006లోనే షాకిచ్చాడు’
అభ్యర్థులకు మెడికల్ టెస్టులకు సంబంధించిన ఈ-అడ్మిట్ కార్డులను సీఆర్పీఎఫ్, ఎస్సెస్సీ అధికారిక వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచారు. మెడికల్ టెస్టులకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ఈ అడ్మిట్ కార్డులతో రావాలని, లేని పక్షంలో వారిని వైద్య పరీక్షలను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. టాలీవుడ్ నటుడు రాజా చెంబోలు ఎంగేజ్‌మెంట్ ఫొటోలు
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మెడికల్ టెస్టులకు హాజరయ్యే అభ్యర్థులు ఆరోగ్య సేతు యాప్ (Aarogya Setu APP) కలిగి ఉండాలని సీఆర్పీఎఫ్ పేర్కొంది. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం (Social Distancing) పాటించాలని సూచిస్తున్నారు.
Click here to download the admit card
ఏవైనా సందేహాలుంటే అభ్యర్థులు 011- 26160255, 011- 26160256, 011- 26160259, 011- 26160260 రిక్రూట్‌మెంట్ సెంటర్లను ఈ ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చునని తెలిపారు. AP Inter Re-verification Results: ఏపీ ఇంటర్ రీ-వెరిఫికేషన్ ఫలితాలు విడుదల