SSC Notification 2021: పదో తరగతి విద్యార్ఙతతో ప్రభుత్వ ఉద్యోగాలు, SSC నోటిఫికేషన్ విడుదల
SSC Notification 2021: నిరుద్యోగులకు శుభవార్త. వివిధ శాఖల్లో ప్రభుత్వ కొలువుల భర్తీకై స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ నోటిఫికేషన్ వెలువరించింది. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఏయే శాఖల్లో ఏ ఉద్యోగాలనేవి ఇప్పుడు తెలుసుకుందాం.
SSC Notification 2021: నిరుద్యోగులకు శుభవార్త. వివిధ శాఖల్లో ప్రభుత్వ కొలువుల భర్తీకై స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ నోటిఫికేషన్ వెలువరించింది. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఏయే శాఖల్లో ఏ ఉద్యోగాలనేవి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు, పోటీ పరీక్షలకు సన్నద్ధమౌతున్న అభ్యర్ధులకు గుడ్‌న్యూస్. స్టాఫ్ సెలెక్షన్ కమీషన్(SSC Notification2021)పెద్దసంఖ్యలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ శాఖల్లో మొత్తం 3 వేల 261 పోస్టుల భర్తీకు నోటిఫికేషన్ వెలువడింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, గర్ల్స్ కేడెట్ ఇన్‌స్ట్రక్టర్, రీసెర్చ్ అసిస్టెంట్, కెమికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్, మెడికల్ అటెండెంట్, టెక్స్‌టైల్ డిజైనర్ వంటి ఉద్యోగాలున్నాయి. కనీస అర్హత పదవ తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ వంటి కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టుల్ని బట్టి 18 నుంచి 30 ఏళ్లలోపు వయస్సుండాలి.
ఎంపిక విధానం, ఎలా దరఖాస్తు చేసుకోవాలి( SSC Selection Process, How to apply for ssc jobs)
కంప్యూటర్ బేస్డ్ పరీక్ష, స్కిల్‌టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్ విధానంలో పరీక్ష(Online Exam)రాయాల్సి ఉంటుంది. 2 వందల మార్కులకు వంద ప్రశ్నలుంటాయి. ఇందులో అర్హత సాధించిన అభ్యర్ధులకు స్కిల్‌టెస్ట్ ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 2021 అక్టోబర్ 25గా ఉంది. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష 2022 జనవరి, ఫిబ్రవరి నెలల్లో నిర్వహిస్తారు. మరిన్ని వివరాలకు గానీ, దరఖాస్తు చేసేందుకు గానీ అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in ను సంప్రదించాలి.
Also read: Corona New Variant: కరోనా వైరస్ కొత్త వేరియంట్, మరీ ప్రమాదకరమంటున్న శాస్త్రవేత్తలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి