పదోతరగతి అర్హతతో 50వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు
పదోతరగతి పాసైన నిరుద్యోగులకు కేంద్రం తీపికబురు అందించింది.
పదోతరగతి పాసైన నిరుద్యోగులకు కేంద్రం తీపికబురు అందించింది. కేంద్ర సాయిధ దళాల నుంచి 54,953 కానిస్టేబుల్, రైఫిల్‌మన్ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ప్రకటన విడుదల చేసింది. 2018 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 23 ఏళ్లలోపు వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళల కోసం ప్రతి విభాగంలోనూ కొన్ని పోస్టులు కేటాయించగా.. ఆగస్టు 20 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం పోస్టుల సంఖ్య: 54,953 (పురుషులకు 47,307; మహిళలకు 7,646)
ఖాళీలు: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)-16984, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)-200, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)-21566, సశస్త్ర సీమబల్ (ఎస్ఎస్‌బీ)-8546, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)-4126, అస్సాం రైఫిల్స్ (ఏఆర్)-3076, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)-08, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్)-447.
ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు పదోతరగతి పాసై ఉండాలి. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు వంద రూపాయలు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్ మెన్ లు ఫీజు నుంచి మినహాయింపు. 21.07.2018 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. మరిన్ని వివరాల కోసం http://ssc.nic.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.