54,953 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ.. ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్
కేంద్ర పారామిలిటరీ బలగాల్లో చేరి దేశ సేవ చేయాలనుకునే యువతకు చక్కటి అవకాశాన్ని అందిస్తున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్
కేంద్ర సాయుధ బలగాలకు సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) భర్తీ చేయనున్న 54,953 కానిస్టేబుల్ కొలువులకు శుక్రవారం నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించినట్టు సీఆర్పీఎఫ్ కమాండెంట్ హరిహోం ఖరే మీడియాకు తెలిపారు. ఆగస్టు 17న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబరు 17తో ముగియనున్నట్టు ఖరె స్పష్టంచేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయడానికి హైదరాబాద్ చాంద్రాయణగుట్టలోని సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్‌లో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా ఖరె తెలిపారు. నేరుగా సంప్రదించడం కుదరని అభ్యర్థులు 040-29809876 నంబర్‌కు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు అని ఖరే అన్నారు.
ఈ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన అభ్యర్థులను ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ), బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), సహస్త్ర సీమ బల్ (ఎస్‌ఎస్‌బీ), మిలిటరీ యూనిట్‌కి చెందిన అసోం రైఫిల్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ), స్పెషల్ సెక్యురిటీ ఫోర్స్ (ఎస్‌ఎస్‌ఎఫ్) బలగాల్లో నియమిస్తారు. ఆసక్తి ఉన్న 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు www.ssc.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని స్టాఫ్ సెలక్షన్ కమిటీ సూచించింది. కేంద్ర పారామిలిటరీ బలగాల్లో చేరి దేశానికి సేవ చేయాలనుకునే యువతకు ఇదో చక్కటి అవకాశం.