Stalin Accident Scheme: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సరికొత్త కార్యక్రమానికి నాంది పలికారు. రోడ్డు యాక్సిడెంట్ లో గాయపడిన వెంటనే సహయం అందేలా దీన్ని రూపొందించారు. ఇకపై రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు సహాయం చేసి ఆస్పత్రిలో చేర్చిన వారికి నగదు బహుమానం అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. ప్రమాద బాధితులకు సహాయం చేసిన వారికి రూ. 5 వేల బహుమానంతో పాటు ప్రశంసాపత్రాన్ని కూడా అందిస్తామని అన్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రిలో చేర్చి.. సహాయం చేసిన వారికి రూ. 5 వేల నగదును బహుమానంగా ఇవ్వనున్నాం. దీంతో పాటు తమ సహాయాలను అందించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రశంసాపత్రాలను అందజేస్తామ"ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ట్విట్టర్ లో ప్రకటించారు. 


ఉచిత వైద్యం


రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఆస్పత్రిలో చేర్చిన దగ్గర నుంచి 48 గంటల వరకు ఉచితంగా వైద్యం అందించే పథకాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 'గోల్డెన్ అవర్' పేరుతో ఈ పథకానికి సంబంధించిన సదుపాయాలను ప్రవేశపెట్టనున్నారు. 


అయితే ఈ పథకం ద్వారా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందే వారికి లక్ష రూపాయల వరకు రాయితీని స్టాలిన్ ప్రభుత్వం ఇవ్వనుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన వారైనా తమిళనాడులో రోడ్డు ప్రమాదానికి లోనయితే.. వారు కూడా ఈ పథకం కింద వైద్యం పొందవచ్చు.  


Also Read: Pushkar Singh Dhami: ఓడినా పుష్కర్ సింగ్ ధామికే పగ్గాలు... రెండోసారి సీఎంగా ఛాన్స్...


Also Read: Congress Crisis: మరోసారి ట్రబుల్ షూటర్‌గా గులాం నబీ ఆజాద్, రెబెల్స్‌తో..తరువాత సోనియాతో భేటీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్