`సీఎం గారూ...నా రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయ్..రక్షించండి ఫ్లీజ్`..బాలిక వీడియాకు స్పందించిన స్టాలిన్
CM Stalin: రెండు కిడ్నీలు దెబ్బతినడంతో తీవ్ర నరకాన్ని అనుభవిస్తున్న ఓ బాలిక సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో సీఎం ఎంకే స్టాలిన్‌ను సైతం కదిలించింది. సోమవారం ఆస్పత్రికి వెళ్లి మరీ ఆ బాలికను పరామర్శించి..మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
CM Stalin: పదేళ్ల వయస్సులోనే పలు క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించింది. రాష్ట్రస్థాయిలో పలు పతకాలు కైవసం చేసుకుంది. ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయింది. కట్ చేస్తే...ఆ బాలిక(Girl)కు రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు. బిడ్డను రక్షించుకునేందుకు తన కిడ్నీని సైతం దానం చేసింది తల్లి. అయినా సరే ప్రయోజనం లేకపోయింది. దాంతోపాటు కాలేయం కూడా చెడిపోయింది. దీంతో తన బిడ్డ ప్రాణాల్ని రక్షించుకునేందుకు ఆ తల్లి సీఎం సెల్‌ను ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళితే..
తమిళనాడులోని సేలం జిల్లా అరిసియాపాళయంకు చెందిన విజయకుమార్, రాజ నందిని దంపతులకు జనని(14) కుమార్తె పదో తరగతి చదువుతోంది. పదేళ్ల వయస్సులోనే కర్రసాము, విలువిద్య, స్కేటింగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించింది. 2019లో హఠాత్తుగా ఈ బాలిక ఇంట్లో స్పృహ తప్పింది.
Also read: Cannibal Couple: 30మందిని పైగా చంపి తిన్న నరమాంస దంపతులు... ఎక్కడంటే..??
రెండు కిడ్నీలు(Kidneys) దెబ్బతిన్నట్లు వైద్యులు నిర్దారించారు. దీంతో బిడ్డను రక్షించుకునేందుకు ఆ తల్లి తన కిడ్నీని దానం చేసింది. శస్త్రచికిత్స జరిగిన 15 రోజుల్లో తల్లి దానం చేసిన కిడ్నీ కూడా దెబ్బతింది. ప్రస్తుతం రెండు కిడ్నీలు పాడైపోవడంతో పాటుగా కాలేయం కూడా చెడిపోయింది. దీంతో తన బిడ్డ ప్రాణాల్ని రక్షించుకునేందుకు ఆ తల్లి సీఎం సెల్‌ను ఆశ్రయించింది. చెన్నై స్టాన్లీ ఆస్పత్రి(Stanley hospital)లో ఆ బాలికకు వైద్యానికి ఏర్పాట్లు చేశారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఆ బాలిక సామాజిక మాధ్యమాల్లో(Soical Media) పెట్టిన ఓ వీడియో సీఎం స్టాలిన్(CM Stalin)ను కదిలించింది.
మెరుగైన వైద్యానికి చర్యలు: స్టాలిన్
‘‘సీఎం సార్, నమస్తే...రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి..రెండేళ్లుగా నరకం చూస్తున్నాను.. డయాలసిస్ చేస్తున్నారు ..నొప్పి భరించలేకున్నాను.. నన్ను రక్షించండి..ప్లీజ్ ’’ అని ఆ బాలిక పెట్టిన వీడియోతో సీఎం చలించిపోయారు. సోమవారం మంత్రులు సుబ్రమణియన్, శేఖర్‌బాబుతో కలిసి స్టాన్లీ ఆస్పత్రికి సీఎం చేరుకున్నారు. ఆ బాలికను పరామర్శించారు. మెరుగైన వైద్యానికి చర్యలు తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు. బాలిక తల్లి రాజనందిని ఓదార్చారు. ఈ సమయంలో ఆమె ఉద్వేగానికి లోనయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
pple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి