SBI Millionaire Scheme: రోజుకు 80 రూపాయలు జమ చేస్తే చాలు లక్షాధికారి కావచ్చు
SBI Millionaire Scheme: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు సరికొత్త స్కీమ్ ప్రారంభించింది. ప్రతి ఇంటా లక్షాధికారి పేరుతో ప్రారంభమైన ఈ పధకంలో రోజుకు 80 రూపాయలు జమ చేస్తే చాలు. లక్షాధికారి కావచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
SBI Millionaire Scheme: ఎస్బీఐ అందిస్తున్న హర్ ఘర్ లక్‌పతి అంటే ప్రతి ఇంటా లక్షాధికారి పధకం ఓ రకంగా చెప్పాలంటే రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లేదా ఆర్‌డి. ప్రతి నెలా చిన్నమొత్తంలో పొదుపు చేయడం ద్వారా భారీగా అంటే లక్షల్లో నగదు పొందవచ్చు. ఈ పధకంపై అందిస్తున్న వడ్డీ రేట్లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఎస్బీఐ కొత్త స్కీమ్ ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా ప్రతి నెలా చిన్న చిన్న మొత్తంలో ఇన్వెస్ట్ చేసి ఒకేసారి పెద్దమొత్తంలో నగదు పొందవచ్చు. ఈ పధకం పేరు ప్రతి ఇంటా లక్షాధికారి. ఇదొక రికరింగ్ డిపాజిట్ స్కీమ్. నెలనెలా చిన్న చిన్న మొత్తంలో నగదు జమ చేసుకోవచ్చు. ఈ పధకం 3 నుంచి 10 ఏళ్ల కాల వ్యవధికి ఉంటుంది. ఇందులో ప్రతి నెలా క్రమం తప్పకుండా కొద్దిమొత్తం జమ చేయాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ అనంతరం భారీగా నగదు అందుతుంది. చిన్నారులయితే పదేళ్ల వయస్సుంటే ఈ స్కీమ్‌లో చేరవచ్చు. సీనియర్ సిటిజన్లకు కూడా అవకాశముంటుంది.
ఈ పథకంలో వడ్డీ రేట్లు ఎక్కువే ఉంటాయి. మెచ్యూరిటీ పీరియడ్‌ను బట్టి వడ్డీ రేట్లు ఉంటాయి. సాధారణ పౌరులకు 6.75 శాతం వడ్డీ ఉంటుంది. అదే సీనియర్ సిటిజన్లకు మాత్రం 7.25 శాతం వడ్డీ ఉంటుంది. ఎస్బీఐ ఉద్యోగి అయితే మాత్రం వడ్డీ 8 శాతం వర్తిస్తుంది. రోజుకు 80 రూపాయల చొప్పున జమ చేస్తే నెలకు 2400-2500 రూపాయలు అవుతుంది. ప్రతి ఇంటా లక్షాధికారి పధకంలో నెలకు 2500 పొదుపు చేస్తే మూడేళ్లకు 1 లక్ష రూపాయలు అందుకోవచ్చు. అదే పదేళ్లకయితే 12-13 లక్షలు అందుకోవచ్చు.
Also read: Sankranti Holidays: ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.