AP & TS Polling: ఏపీలో పోలింగ్ ప్రారంభమైంది. ఎండల భయంతో జనం ఉదయమే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చేశారు. ఉదయం 7 గంటల్నించి 9 గంటల వరకూ ఏపీ , తెలంగాణలో సరాసరిన 9-10 శాతం మధ్యలో పోలింగ్ నమోదైంది. ఉదయం 11 గంటల వరకూ పోలింగ్ శాతం భారీగా ఉండి ఆ తరువాత తగ్గవచ్చని తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో పోలింగ్ ఉదయం నుంచి వేగంగా నమోదవుతోంది. ఏపీలో ఉదయం 7 గంటల్నించి 9 గంటల వరకూ 9.21 శాతం ఓటింగ్ నమోదు కాగా తెలంగాణలో 9.51 శాతం నమోదైంది. ఇవాళ దేశవ్యాప్తంగా నాలుగోదశ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా 96 స్తానాలకు పోలింగ్ జరుగుతోంది. ఏపీలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు జరుగుతుంటే, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు జరగనున్నాయి. ఏపీ, తెలంగాణలోని వివిధ జిల్లాల్లో నమోదైన పోలింగ్ శాతం పరిశీలిద్దాం...


కడపలో అత్యధికంగా 12.09 శాతం, చిత్తూరులో 11.84 శాతం, బాపట్లలో 11.36 శాతం నమోదు కాగా, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 6.77 శాతం, అనకాపల్లిలో 8.37 శాతం, అనంతపురంలో 9.18 శాతం, అన్నమయ్య జిల్లాలో 9.89 శాతం, కృష్ణా జిల్లాలో 10.80 శాతం కోనసీమలో10. 42 శాతం, నంద్యాలలో 10.32 శాతం, విశాఖపట్నంలో 10.24 శాతం, ఏలూరులో 9.9 శాతం, పశ్చిమ గోదావరి జిల్లాలో 9.57 శాతం, నెల్లూరులో 9.51, కర్నూలులో 9.34 శాతం, ప్రకాశం జిల్లాలో 9.14 శాతం, ఎన్టీఆర్ జిల్లాలో 8.95 శాతం, విజయనగరం జిల్లాలో 8.77 శాతం, తూర్పు గోదావరి జిల్లాలో 8.68 శాతం, పల్నాడులో 8.53 శాతం శ్రీకాకుళం జిల్లాలో 8.30 శాతం, తిరుపతిలో 8.11 శాతం, గుంటూరులో 6.17 శాతం, కాకినాడలో 7.95 శాతం, సత్యసాయి జిల్లాలో 6.92 శాతం నమోదైంది.


ఇక తెలంగాణలో అదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 13.22 శాతం, జహీరాబాద్ జిల్లాలో 12.88 శాతం, నల్గొండలో 12.80 శాతం, ఖమ్మం జిల్లాలో 12.24, మహబూబాబాద్‌లో 11.94 శాతం, మెదక్‌లో 10.99 శాతం, నిజామాబాద్‌లో 10.91 శాతం, భువనగిరిలో 10.54 శాతం, మహబూబ్ నగర్‌లో 10.33 శాతం, కరీంనగర్‌లో 10.23 శాతం, నాగర్ కర్నూలులో 9.81 శాతం, పెద్దపల్లిలో 9.53 శాతం, హైదరాబాద్‌లో 5.6 శాతం, సికింద్రాబాద్‌లో 5.40, మల్కాజ్‌గిరిలో 6.20 శాతం నమోదైంది. 


Also read: Vote Casting Tips: ఓటు సరిగ్గా పడిందో లేదో ఎలా తెలుస్తుంది, ఈ జాగ్రత్తలు పాటించండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook