DRR Studio: వేసవి కాలం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఎండలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఈ క్రమంలో అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ ఎండల ధాటికి ఓ ప్రముఖ స్టూడియోలో భారీ ప్రమాదం సంభవించింది. ప్రమాదం ధాటికి స్టూడియోలోని షూటింగ్‌ సామగ్రి అగ్నికి ఆహుతైంది. మేకప్‌ వ్యాన్‌లు, కెమెరాలు, సెట్లు దగ్ధమవడంతో సినీ రంగం దిగ్భ్రాంతికి గురయ్యింది. ఈ ఘటనపై సినీ రంగ ప్రముఖులు ఆందోళన చెందారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Cyber Crime: సైబర్‌ నేరగాళ్లకు మరో ప్రాణం బలి.. 19 ఏళ్లకే నిండిన నూరేళ్లు


 


పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కత్తాలోని డీఆర్‌ఆర్‌ స్టూడియో అతిపెద్దది. బెంగాలీ సినీ పరిశ్రమకు అతి పెద్ద స్టూడియోగా వెలుగొందుతున్న ఈ స్టూడియోను 'రాంబాబు గార్డెన్‌'గా పిలుస్తుంటారు. బెంగాలీ చిత్ర పరిశ్రమలో అన్ని ప్రముఖ రియాలిటీ షోలతోపాటు సినిమాలు ఇక్కడ తీస్తుంటారు. సోమవారం సాయంత్రం ఉదయం అకస్మాత్తుగా స్టూడియో ప్రాంతంలో మంటలు వ్యాపించాయి. క్యాంటీన్‌ నుంచి మేకప్‌ వ్యాన్‌ వరకు మంటలు చెలరేగాయి. ప్రమాదంలో మేకప్‌ వ్యాన్‌లు మంటల్లో కాలిపోయాయి. ప్రమాదం విషయం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుంది. మూడు ఫైర్‌ ఇంజన్ల ద్వారా మంటలను ఆర్పివేశారు. రెండు గంటల పాటు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది.

Also Read: Viral Video: బ్యాచిలర్‌ పార్టీలో స్నేహితుల మధ్య గొడవ.. అంకుల్‌ వచ్చి చితక్కొట్టాడు


 


పశ్చిమ బెంగాల్‌లో వేసవికాలం ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక వేడితో తీవ్రంగా సతమతమవుతున్నారు. ఎండ వేడికి తాళలేకపోతున్నారు. ఎండ వేడికి రాష్ట్రంలో చాలా చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కొన్ని చోట్ల కార్లు, బైక్‌లు దహనమవుతున్నాయి. వేసవి నేపథ్యంలో అధికారులు కీలక సూచనలు చేస్తున్నారు. బయటకు వెళ్తున్న సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter