న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో కపిల్ సిబాల్ వాదన అంగీకరించమని సున్ని వక్ఫ్ బోర్డు తెలిపింది. 2019 ఎలక్షన్స్ తరువాత అయోధ్య వివాదంపై విచారణ చేపట్టాలని సిబాల్ సుప్రీంలో వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే..! కపిల్ సిబాల్ సున్ని వక్ఫ్ బోర్డు తరుఫున కోర్టుకు హాజరయ్యారు.


సిబాల్ తమ తరుపు న్యాయవాదే అయినప్పటికీ సుప్రీంలో ఆయన చేసిన వాదనతో తాము అంగీకరించడం లేదని సున్ని బోర్డు మాజీ సభ్యుడు హాజీ మెహబూబ్ తెలిపారు. అయోధ్య వివాదం త్వరగా పరిష్కారం కావాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. కపిల్ సిబాల్ ను తాము నియమించుకున్న న్యాయవాదే.. అయినప్పటికీ ఆయన ఒక రాజకీయ పార్టీకి చెందినవారని, సుప్రీంకోర్టులో ఆయన చేసిన వాదన తప్పని మెహబూబ్ వ్యాఖ్యానించారు.