తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. రాజకీయ ఆరంగేట్రం ఎప్పుడు..?  ఎప్పటి వరకు పార్టీ స్థాపించనున్నారు..? ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు..? ఇలాంటి ప్రశ్నలకు మరికొద్ది రోజుల్లోనే సమాధానాలు లభించనున్నాయి.  ఈ క్రమంలో ఆయన త్వరలోనే ప్రకటన విడుదల చేస్తారని అభిమానులు ఎదురు చూస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలా కాలంగా తలైవా..రాజకీయ ఆరంగేట్రం గురించి తమిళనాడు సహా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే రజినీ మక్కల్ మండ్రుం పేరుతో పలుమార్లు అభిమానులతోనూ సూపర్ స్టార్ రజినీకాంత్ సంప్రదింపులు జరిపారు. రాజకీయ యవనికపైకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఐతే ఈ ఏడాదిలోగా ఆయన పార్టీ పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 


Read Also: ఢిల్లీ అల్లర్లకు కేంద్రానిదే బాధ్యత: రజినీకాంత్ 
వచ్చే ఏడాది ఎన్నికలు
తమిళనాడులో 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది పార్టీని స్థాపించి.. వచ్చే ఎన్నికల నాటికి రంగం సిద్ధం చేసుకోవాలని సూపర్ స్టార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పనులను వేగవంతం చేశారనే టాక్ వినిపిస్తోంది. నిన్న మీడియాతో మాట్లాడిన రజినీకాంత్ సోదరుడు సత్యనారాయణ.. ఈ ఏడాది పార్టీ స్థాపన ఖాయమని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో రజినీకాంత్ సొంత పార్టీతో ఎన్నికలకు వెళ్తారని తెలిపారు.  


అంతే కాదు ..  సూపర్ స్టార్ రజినీకాంత్ శ్రీపెరంబూర్ జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతారని రజినీ సోదరుడు చెబుతున్నారు. ఐతే ఆయన వచ్చే శాసనసభ ఎన్నికల్లో హెప్పనహెళ్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఈ నియోజకవర్గం రజినీకాంత్ సొంత రాష్ట్రం కర్ణాటకకు దగ్గరగా ఉంటుంది. దీంతో ఆయన ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. Read Also:రజినీకాంత్ పెళ్లినాటి ఫోటో షేర్ చేసిన కూతురు