పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు
Pegasus Spyware: దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న పెగసస్ స్నూపింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కేసు వాయిదా వేసింది.
Pegasus Spyware: దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న పెగసస్ స్నూపింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కేసు వాయిదా వేసింది.
పెగసస్ స్పైవేర్ (Pegasus Spyware)వ్యవహారంపై ఓ వైపు పార్లమెంట్‌లో ఆందోళన జరుగుతుండగానే మరోవైపు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ చేస్తోంది. ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ పిటీషన్లు దాఖలయ్యాయి. అయితే ప్రభుత్వం నుంచి ఈ అంశంపై సమాధానం రావల్సి ఉందని..సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పడంతో..కోర్డు ఆగస్టు 16కు కేసు వాయిదా వేసింది. ఇప్పటికే ఈ అంశంపై సుప్రీంకోర్టు(Supreme Court) ఛీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ(Chief justice n v ramana) కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఆరోపణలు నిజమైతే..తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని ఎన్ వి రమణ తెలిపారు.
జర్నలిస్టులు, రాజకీయ నేతలు, న్యాయమూర్తులు, రక్షణ రంగ ప్రముఖులు, మానవ హక్కుల నేతలు తదితరుల ఫోన్లను హ్యాకింగ్ చేశారనేది ప్రధాన ఆరోపణ. కోర్టులో కేసు వాదన జరుగుతుండగానే..పిటీషనర్లు సోషల్ మీడియాలో సమాంతర చర్చలు ఎందుకు చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. ఒకసారి కోర్టుల్ని ఆశ్రయించిన తరువాత విశ్వాసముంచాలని సూచించింది. మరోవైపు పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాల ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పెగసస్ వ్యవహారంపై ఎన్ఎస్ఓ గ్రూప్(NSO Group)తో లావాదేవీలు జరపలేదని కేంద్ర రక్షణ శాఖ లిఖితపూర్వక సమాధానమిచ్చింది.
Also read: ఏపీలో ఇక నుంచి పెళ్లిళ్లలో 150 మంది వరకూ అనుమతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook