Supreme Court on Hijab Issue: కర్ణాటకలో సంచలనం రేపిన హిజాబ్ అంశం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. కర్ణాటక హైకోర్టు ఆదేశాల్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు స్పందించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిజాబ్ వివాదం ఇంకా సమసిపోలేదు. ఇస్లాం ప్రకారం హిజాబ్ ధారణ తప్పనిసరి కాదని..విద్యాసంస్థల్లో యూనిఫాం తప్పనిసరి అంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను కర్ణాటక హైకోర్టు సమర్ధించింది. విద్యార్ధులు దాఖలు చేసుకున్న పిటీషన్లను జస్టిస్ రితురాత్ అవస్థీ, జస్టిస్ కృష్ణ, జస్టిస్ జైబున్నీసా ఎం వాజీలతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ కొందరు విద్యార్ధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అటు ఈ తీర్పు మత విశ్వాసాలకు, వ్యక్తిగత స్వేచ్ఛకు, గోప్యతకు భంగం కల్గించేలా ఉందని తెలిపారు. తాము కూడా సుప్రీంకోర్టుకు వెళతామని ఇప్పటికే వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు మౌలానా షఫీ తెలిపారు. హిజాబ్ ధారణ గురించి ఖురాన్‌లో స్పష్టంగా ఉన్నప్పుడు..ఏ ఆధారాలతో హైకోర్టు ఈ తీర్పు ఇచ్చిందో అర్ధం కావడం లేదన్నారు. అటు ఈ తీర్పుకు వ్యతిరేకంగా కర్ణాటకలో పలు ప్రాంతాల్లో విద్యార్ధులు పరీక్షలు బహిష్కరించారు. చదువుతో పాటు హిజాబ్ ముఖ్యమని..ధరించి తీరుతామన్నారు. ఈ తీర్పు ప్రాధమిక హక్కుల్ని ఉల్లంఘించేదిగా ఉందని..మతపరమైన స్వేచ్ఛ, సంస్కృతి, భావ ప్రకటన, రాజ్యాంగం అందించిన ఆర్టికల్ 15కు వ్యతిరేకమని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. హిజాబ్ వేసుకుంటే వారికొచ్చిన సమస్యేంటని ప్రశ్నించారు. 


హోలీ అనంతరం విచారణ


ఇటు ఇదే అంశంపై కర్ణాటక హైకోర్చు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు స్పందించింది. హోలీ పండుగ సెలవుల అనంతరం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ స్పష్టం చేశారు. కొందరు విద్యార్ధుల తరపున అడ్వొకేట్ సంజయ్ హెగ్డే దాఖలు చేసిన పిటీషన్‌ను జస్టిస్ ఎన్ వి రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పరిశీలించింది. రానున్న పరీక్షల్ని దృష్టిలో ఉంచుకుని..వెంటనే ఈ అంశంపై విచారణ చేపట్టాలని పిటీషనర్ కోరారు. దీనిపై జస్టిస్ ఎన్ వి రమణ స్పందించారు. విద్యాసంస్థల్లో హిజాబ్ అంశంపై ఇంకొన్ని పిటీషన్లు ఉన్నాయని..హోలీ అనంతరం విచారణ చేపడతామని చెప్పారు. 


ఇప్పటికే కర్ణాటక హైకోర్టు తీర్పుపై ముస్లిం సంఘాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హిజాబ్ ధరించవద్దని చెప్పడం ఒకరి మత విశ్వాసాలకు విఘాతం కల్గించడమేనని అంటున్నారు. ఖురాన్‌లో స్పష్టంగా ఈ అంశంపై ప్రస్తావన ఉన్నప్పుడు..హైకోర్టు ఇస్లాంలో తప్పనిసరి కాదని చెప్పడం ఆశ్చర్యం కల్గిస్తోందని చెబుతున్నారు.


Also read: PM Kisan 11th Instalment: పీఎం కిసాన్ యోజన 11వ విడత నిధుల విడుదల ఎప్పుడంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook