Chief Justice NV Ramana: భారతీయ న్యాయస్థానాలపై సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థలో మౌళిక వసతుల కల్పన విషయంలో సంచలన వ్యాఖ్యలే చేశారు. మౌళిక సదుపాయాల విషయంలో నిర్లక్ష్యమే కారణంగా ఎత్తి చూపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ(Justice N V Ramana).. న్యాయస్థానాల్లోని మౌళిక సదుపాయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటీషు పాలన అనంతరం న్యాయవ్యవస్థలో మౌళిక వసతుల కల్పనలో పూర్తిగా నిర్లక్ష్యం రాజ్యమేలిందని జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు. జాతీయ జ్యుడీషియల్ ఇన్‌ఫ్రా కార్పొరేషన్ ఏర్పాటుతోనే ఈ సమస్యకు సమాధానం లభిస్తుందని సూచించారు. ఉత్తరప్రదేశ్ జాతీయ లా యూనివర్శిటీ, అలహాబాద్ హైకోర్టు కొత్త భవనం శంకుస్థాపనలో రాష్ట్రపతితో పాటు జస్టిస్ రమణ పాల్గొన్నారు.


దేశంలోని న్యాయస్థానాల్లో మెరుగైన వసతులు(Basic Infrastructure Facilities)లేకపోవడం విచారకరమని..న్యాయ సిబ్బంది పనితీరుపై ప్రభావం కన్పిస్తుందని జస్టిస్ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని జాతీయ ఆస్థుల నిర్మాణ సంస్థలతో కలిసి ఎన్‌జేఐసీ పనిచేస్తుందని, జాతీయ కోర్టు డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు నమూనాలను అభివృద్ధి చేస్తుందన్నారు. సరైన మౌళిక వసతుల కల్పనతో న్యాయం పొందే మార్గం సుగమం అవుతుందన్నారు. అలహాబాద్ హైకోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడంపై స్పందించారు. ఇతర విషయాలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు జస్టిస్ జగ్‌మోహన్ లాల్ సిన్హా ఇచ్చిన తీర్పు అత్యంత సాహసోపేతమైందని ప్రశంసించారు. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఇందిరాగాంధీ ఎన్నికను చెల్లకుండా చేసిన ఈ తీర్పు దేశంలో ఓ కుదుపు తెచ్చిందన్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సైతం అందుకే విధించారని గుర్తు చేశారు. అలహాబాద్ హైకోర్టుకు 150 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. 


Also read: NEET Exam 2021: దేశవ్యాప్తంగా నీట్ పరీక్షకు ఏర్పాట్లు, నిషేధిత వస్తువుల జాబితా ఇదే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook