Independence Day2021 Celebrations: సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ పార్లమెంట్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలిప్పుడు సంచలనంగా మారాయి. దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో(Independence day celebrations) ఛీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ(Chief justice N V Ramana)కీలకమైన, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ తీరుపై మాట్లాడారు. పార్లమెంట్ ఉభయసభల్లో సరైన చర్చలు జరగడం లేదని అసహనం వ్యక్తం చేశారు. చట్టసభల చర్చల్లో రోజురోజుకు నాణ్యత తగ్గుతున్నట్లు కనిపిస్తోందని అన్నారు. చట్టాల రూపకల్పనలో సమగ్రత లోపించడం లిటిగేషన్లకు దారి తీస్తోందని ఆరోపించారు. కొన్ని చట్టాలను కోర్టులు సైతం అర్థం చేసుకోలేకపోతున్నాయని చెప్పడం విశేషం. గతంలో న్యాయవాదులు ఎక్కువగా ఉభయసభల్లో ఉండేవారని..ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పారు. 


కొత్త చట్టాలు చేసే సమయంలో పార్లమెంట్‌లో(Parliament) చర్చ జరగకపోవడంతో న్యాయపరమైన చిక్కులు ఏర్పడే అవకాశముందని జస్టిస్ ఎన్‌వి రమణ అభిప్రాయపడ్డారు. కొత్త చట్టాల అమలు ఉద్దేశ్యం ఏమిటనేది కూడా అర్ధం కావడం లేదన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల్లో కూడా ఎక్కువమంది న్యాయవాదులున్నారనే విషయాన్ని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. తొలి లోక్‌సభ(Loksabha), రాజ్యసభల్లో(Rajyasabha) ఎక్కువ మంది న్యాయవాదులేనని తెలిపారు. ప్రస్తుతం పార్లమెంట్ ఉభయసభల్లో చర్చలు దురదృష్టకరమన్నారు. అప్పట్లో చర్చలనేవి నిర్మాణాత్మకంగా ఉండేవన్నారు. కేవలం న్యాయవాద వృత్తికే పరిమితం కాకుండా ప్రజాసేవకు కూడా కొంత సమయాన్ని కేటాయించాలని న్యాయవాదులకు పిలుపునివ్వడం విశేషం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో పథకాల్ని సమీక్షించుకోవల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్రమంటే చిన్న సమయం కాదన్నారు. 


Also read: Karnataka: రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్ ఆంక్షలకు సిద్ధమౌతున్న ప్రభుత్వం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook