కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. 'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న వేళ..  అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'కరోనా వైరస్' కారణంగా  ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ పరిధిలోకి వెళ్లిపోయాయి. మహమ్మారి దెబ్బకు ప్రజలంతా గజగజా వణుకుతున్నారు. మరోవైపు, భారత దేశంలో కంటే ప్రపంచ దేశాల్లో  కరోనా వేగంగా విస్తరిస్తోంది.  దీంతో విదేశాల్లో ఉన్న భారతీయులు స్వదేశానికి రావాలని ఎదురు చూస్తున్నారు. ఐతే లాక్ డౌన్ కారణంగా వారు ఎక్కడికీ కదలలేని పరిస్థితి నెలకొంది. 


బ్రిటన్ లోనూ భారతీయులు చాలా మంది చిక్కుకుపోయారు. ముఖ్యంగా విద్యార్థులు అక్కడ చాలా అవస్థలు పడుతున్నారు. దీంతో వారిని భారత దేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ మధురిమ మృదుల్ అనే న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం.. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..