Pegasus Spyware: పెగసస్ స్పైవేర్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. వివాదాస్పద పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై దర్యాప్తు కోరుతూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో దాఖలైన పిటీషన్లపై విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా పెగసస్ స్పైవేర్(Pegasus Spyware) వ్యవహారంపై సెగలు రేపుతోంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో 9 పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పిటీషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు (Supreme Court) ఛీప్ జస్టిస్ ఎన్ వి రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ నేతలు, రాజ్యాంగ అధికారులు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు, మానవ హక్కుల నేతలే టార్గెట్‌గా ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయించకపోవడాన్ని ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ ప్రశ్నించారు. స్పైవేర్‌ను ఎవరు కొనుగోలు చేశారు, హార్డ్‌వేర్ ఎక్కడుంచారనేది ప్రభుత్వం వెల్లడించాలన్నారు. ఇది కచ్చితంగా వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవానికి భంగం కల్గించేదని కపిల్ సిబల్ వాదించారు. 


ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ(Justice N V Ramana) కీలక వ్యాఖ్యలు చేశారు.పెగసస్‌పై మీడియా నివేదిక నిజమే అయితే కచ్చితంగా ఇది చాలా తీవ్రమైన అంశమని అన్నారు. లోతైన విచారణ జరగాల్సి ఉందని తెలిపారు. అయితే వాదనకు అనుకూలమైన మెటీరియల్‌ను పిటీషనర్లు అందించలేకపోయారని చెప్పారు. పరిజ్ఞానమున్న వ్యక్తులై ఉండి కూడా వివరాలు సేకరించడానికి ప్రయత్నించలేదన్నారు. అదే విధంగా ఈ సాఫ్ట్‌వేర్ వల్ల ప్రభావితమయ్యామని చెప్పుకుంటున్న వ్యక్తుల్లో ఎవరూ ఫిర్యాదు చేయలేదని గుర్తు చేశారు. ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై పిటీషన్లు దాఖలు చేసినవారిలో సీనియర్ జర్నలిస్టు ఎన్ రామ్, శశికుమార్, సీపీఎం రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిటాస్, న్యాయవాది, న్యాయవాది ఎంఎల్ శర్మ ఇందులో ఉన్నారు. ఈ నిరసనలు, వాగ్వాదాల మధ్య పెగసస్(Pegasus) నిఘాపై చర్చకు అంగీకరించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 


Also read: కరోనా సంక్రమణ నేపధ్యంలో రానున్న పండుగల్లో కఠిన ఆంక్షలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook