supreme court: ‘''తాను ఎక్కాల్సిన రైలు ఎప్పుడూ జీవితకాలం లేటు'' అన్న కవి ఆరుద్ర మాటలు  సమంజసమేనని అనిపిస్తుంది. జనజీవనంలో ట్రైన్ ఆలస్యమనే పదం పరిపాటిగా మారిపోయింది. కానీ, సుప్రీంకోర్టు(supreme court) మాత్రం ట్రైన్ ఆలస్యాన్ని తీవ్రంగా ఖండించింది. కచ్చితంగా దానికి బాధ్యత వహించాలని, సేవలకు జవాబుదారీతనం వహించాల్సిందేనని స్పష్టం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైలు రావటం ఆలస్యమైన కారణంగా ఫ్లైట్ మిస్ అయిన ఓ వ్యక్తికి రూ. 30వేల పరిహారం చెల్లించాలని రైల్వే శాఖ(Railway Department)ను సుప్రీంకోర్టు(supreme court) ఆదేశించింది. ట్రైన్ ఆలస్యానికి రైల్వే శాఖ సరైన వివరణ ఇవ్వకపోతే సేవల్లో అంతరాయాలున్నాయని ఫిర్యాదు చేసిన వ్యక్తికి పరిహారం చెల్లించాల్సిందేని స్పష్టం చేసింది. 


Also Read: Sadanand Singh: బీహార్ మాజీ సీఎం సదానంద్ సింగ్ కన్నుమూత


అసలేం జరిగిందంటే...
2016 జూన్ 11న సంజయ్ శుక్లా(Sanjay Shukla) జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్లడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు. జమ్ముకు వెళ్లాడానికి కుటుంబసమేతంగా ట్రైన్ ఎక్కారు. షెడ్యూల్ ప్రకారం ఆ రైలు ఉదయం 8.10 గంటలకు జమ్మూ చేరుకోవాలి. కానీ, ఆ రోజు నాలుగు గంటల ఆలస్యంతో మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంది. దీంతో శుక్లా ఫ్లైట్(Flight) అందుకునే అవకాశమే లేకపోయింది. దీంతో ఆయన ఓ ట్యాక్సీని హైర్ చేసుకుని రూ. 15వేలు పెట్టి కుటంబసమేతంగా శ్రీనగర్ చేరుకున్నారు. అక్కడ గడపడానికి లాడ్జింగ్ కోసం మరో రూ. 10వేలు వెచ్చించాల్సి వచ్చింది. తనకు జరిగిన అంతరాయాన్ని ఆయన కన్జ్యూమర్ కోర్టు(Consumer Court)లో ఫిర్యాదు చేశారు.


దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ రైల్వే శాఖను తప్పుపట్టింది. సేవలు అందించడంలో ప్రైవేటురంగాలతో పోటీపడాలని, ఇలా జవాబుదారీతనం లేకుండా జాప్యం చేయడం తగదని హితవుపలికింది. ప్రయాణికుల సమయం అమూల్యమైనదని తెలిపింది. ట్రైన్(Train delay) జాప్యానికి పరిహారం చెల్లించాలని రైల్వేను ఆదేశించింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook