NEET UG 2024 Row: నీట్ యూజీ 2024 పరీక్షలో అవకతవకలు, పేపర్ లీక్, గ్రేస్ మార్కుల గందరగోళం వంటి అంశాలపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ మళ్లీ వాయిదా పడింది. జూలై 18వ తేదీన ఇరు పక్షాల వాదనలు వింటామని సుప్రీంకోర్టు ఛీప్ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. దాంతో విద్యార్ధులకు మరోసారి నిరాశ తప్పలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నీట్ యూజీ 2024 విద్యార్ధులు ఎప్పుడూ లేనంత గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా 23 లక్షలమంది నీట్ విద్యార్ధులు సుప్రీంకోర్టు నిర్ణయం కోసం ఎదురుచూస్తుండగా మరోసారి నిరాశ తప్పలేదు. నీట్ రీ టెస్ట్ ఉంటుందా లేక కౌన్సిలింగ్ జరుగుతుందా అనే స్పష్టత ఇంకా లభించలేదు. నీట్ యూజీ 204 వివాదంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జూలై 18వ తేదీకు వాయిదా పడింది. 


నీట్ యూజీ 2024 కేసులో వివిధ పక్షాలు సమర్పించిన అఫిడవిట్లను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉందని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఈ కేసులో జూలై 8న తీర్పు ఉంటుందని అంతా ఆశించారు. కానీ జూలై 11 అంటే ఇవాళ్టికి వాయిదా పడింది. ఇవాళ తిరిగి జూలై 18కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. రీ నీట్ పరీక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ కేసులో మద్రాస్ ఐఐటీ నివేదికను కోర్టుకు సమర్పించింది. నీట్ యూజీ 2024లో మాస్ మాల్ ప్రాక్టీసు జరగలేదని తెలిపింది. ఈ కేసులో పేపర్ లీకేజ్, అవకతవకలకు సంబంధించి ఇప్పటి వరకూ 47 మందినే అనుమానిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం వివరించింది. అంతేకాకుండా ఇకపై నీట్ యూజీ 2024 పరీక్షను ఓఎంఆర్ విధానం అంటే ఆఫ్‌లైన్ కాకుండా ఆన్‌లైన్‌లో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపింది. 


ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తరపున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతా జూలై 15, 16 తేదీల్లో అందుబాటులో ఉండకపోవడంతో జూలై 18కు వాయిదా పడింది. ఇప్పటికే జూన్ 23న ఈ కేసుకు సంబంధించి సీబీఐ సమర్పించి స్టేటస్ రిపోర్టును కూడా పరిశీలిస్తామని ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. నీట్ పరీక్ష ప్రక్రియను బలోపేతం చేసేందుకు ఇస్రా మాజీ ఛైర్మన్, ఐఐటీ కాన్పూర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్ కే రాధాకృష్ణన్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైందని కేంద్రం వివరించింది. 


నీట్ యూజీ 2024లో అవకతవకలను తేల్చేందుకు ఐఐటీ మద్రాస్ 2023, 2024లో వచ్చిన 140,000 ర్యాంకుల్ని విశ్లేషించింది. అవకతవకలు, లబ్ది ఆరోపణల నేపధ్యంలో వివిధ నగరాలు, కేంద్రాల్లో ఎక్కువ మార్కుల పంపిణీ స్థిరంగానే ఉందని మద్రాస్ ఐఐటీ తెలిపింది. సిలబస్ 25 శాతం తగ్గించడమే ఎక్కువ మార్కుల్ని ప్రభావితం చేసే అంశంగా మద్రాస్ ఐఐటీ అభిప్రాయపడింది మొత్తానికి ఈ కేసు విచారణ మరోసారి వాయిదా పడింది.


Also read: ITR Download Process: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook