Supreme Court on Kiren Rijiju: కొలీజియం వ్యవస్థపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ప్రశ్నలు సంధించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తుల నియామకంలో కేంద్ర మంత్రి ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కొలీజియం పంపిన పేర్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంపై మండిపడింది. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి ప్రకటన చేసి ఉండరాదని కోర్టు పేర్కొంది. మాజీ న్యాయమూర్తి మదన్ బి లోకూర్ మాట్లాడుతూ.. అద్దాల మేడలో నివసించేవాళ్లు ఇతరులపై రాళ్లు రువ్వకూడదని అన్నారు. న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రశ్నించడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రిజిజు ఏం మాట్లాడుతున్నారో తనకు తెలియదని అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

న్యాయశాఖ మంత్రి ఏం అన్నారు..?


కొలీజియం వ్యవస్థ పారదర్శకంగా లేదని కిరణ్‌ రిజిజు అభిప్రాయం వ్యక్తంచేశారు. న్యాయమూర్తుల నియామకం కోసం రూపొందించిన ఈ కొలీజియం వ్యవస్థ పట్ల దేశ ప్రజలు సంతోషంగా లేరని ఆయన అన్నారు. సగం సమయంలో న్యాయమూర్తుల నియమాలకే పోతుందన్నారు. దీంతో కేసుల పరిష్కారంపై ప్రభావం చూపిస్తుందన్నారు. కొలీజియం పంపించిన ప్రతి పేరును ప్రభుత్వం వెంటనే ఆమోదించడం సాధ్యం కాదన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.


న్యాయవ్యవస్థను తమ ప్రభుత్వం ఎప్పుడూ గౌరవిస్తుందన్నారు. 'మా ప్రభుత్వం వచ్చి 8 ఏళ్లు అవుతున్నా.. న్యాయవ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం ఏనాడూ వ్యవహరించలేదు. న్యాయవ్యవస్థ అధికారాన్ని మా ప్రభుత్వం ఎన్నడూ నిర్వీర్యం చేయలేదన్నారు. న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యం మెరుగుపరచాలనేది మా ప్రయత్నం.
మేము సోదరులం. ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం సరికాదు. అందరం కలిసి పనిచేసి దేశాన్ని బలోపేతం చేస్తాం. ఒక వ్యవస్థ విజయవంతం కావాలంటే.. అందరూ కలిసి కట్టుగా పనిచేయాలి..' కిరణ్‌ రిజిజు అన్నారు.


కేంద్ర మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. NJAC రాజ్యాంగ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయినందుకు ప్రభుత్వం కలత చెందుతున్నట్లు కనిపిస్తోందని పేర్కొంది. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి ప్రకటన చేయకూడదని సూచించింది.


న్యాయమూర్తుల నియామకంపై విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రభుత్వం వద్ద చాలా కాలంగా ఫైళ్లు నిలిచిపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. "కొందరి పేర్లు ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం వద్ద ఉన్నాయి. వ్యవస్థ ఇలా ఎలా పని చేస్తుంది..? మంచి న్యాయవాదులను న్యాయమూర్తులుగా అంగీకరించడం అంత సులభం కాదు. కానీ ప్రభుత్వం అలా నియామకం చేసింది. జాప్యం వల్ల ఇబ్బంది పడిన వ్యక్తులు.. తర్వాత తమ పేర్లను ఉపసంహరించుకుంటారా..?" అని జస్టిస్ కౌల్ ప్రశ్నించారు. 


ప్రభుత్వం ఎలాంటి కారణం చూపకుండా పేర్లను నిలుపుదల చేయడం సరికాదని కోర్టు పేర్కొంది. ప్రభుత్వం తన కోరిక మేరకు పేరును ఎంపిక చేస్తోందని.. దీంతో సీనియారిటీ క్రమం కూడా గల్లంతవుతోందని అభిప్రాయం వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఫైళ్లపై ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత స్పందిస్తామన్నారు. దీనిపై విచారణను కోర్టు డిసెంబర్ 8కి వాయిదా వేసింది. కోర్టు ధిక్కార నోటీసు జారీ చేయాలని సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ డిమాండ్ చేశారు. దీనిని అటార్నీ జనరల్ వ్యతిరేకించారు.


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంపు తరువాత కీలక ప్రకటన  


Also Read: యువరాజ్ సింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు.. ఒకే ఓవర్‌లో 7 సిక్సులు! కొట్టింది మనోడే


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook