Weather Update: ఏపీ, తెలంగాణపై ఉపరితల ఆవర్తనం, ఉత్తర-దక్షిణ ద్రోణి కేంద్రీకృతమైంది. వీటి ప్రభావంతో రాగల మూడురోజులపాటు వర్షాలు కురవనున్నాయి. నిన్నటి ఉత్తర-దక్షిణ ద్రోణి ..ఇవాళ దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరం ప్రదేశం వరకు కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కేంద్రీకృతమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు నిన్న రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తనం..ఇవాళ తమిళనాడు, కోస్తా తీరం, పరిసర ప్రాంతాల్లో ఉంది. సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతోంది. వీటి ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాగల మూడురోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. 


ఇవాళ, ఎల్లుండి రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. నిన్న, ఇవాళ హైదరాబాద్‌లో వర్షాలు దంచికొండుతున్నాయి. ఉదయం వేళలో ఎండలు పెడుతున్నా..సాయంత్రం, రాత్రి వేళల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇటు ఏపీలో రాగల మూడురోజులపాటు వర్షాలు కురువనున్నాయి. 



ఉత్తర, దక్షిణ కోస్తా, యానం ప్రాంతాల్లో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడనున్నాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.రాయలసీమలో మాత్రం భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే అక్కడ జోరుగా వానలు పడుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాయలసీమ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు అవుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.


Also read:BJP: తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయం..జేపీ నడ్డా, అమిత్ షా కీలక వ్యాఖ్యలు..!


Also read:Nethanna Bima: చేనేతకు పెద్దపీట వేస్తున్నాం..7న అద్భుత పథకం తీసుకొస్తున్నామన్న కేటీఆర్..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook