Ayodhya Ram Mandir Updates: దేశ మొత్తం రామ నామస్మరణతో మారుమోగుతోంది. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఊరూ వాడా సందడి నెలకొంది. ఈ అపూర్వ ఘట్టం కోసం ఎంతోమంది కలలు కన్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి పోరాడి కోరిక నెరవేరకుండానే ప్రాణాలు విడిచిన వారు ఉన్నారు. మరికొందరు వంశపార్యపరంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కృషి చేస్తూ.. తమ పోరాటం కొనసాగించారు. వీరిలో సూర్యవంశి ఠాకూర్ వంశస్థులు కూడా ఉన్నారు. వీళ్లు దాదాపు 500 ఏళ్లుగా తలపాగా ధరించకుండా.. రామ మందిర నిర్మాణం కోసం ఎదురుచూశారు. ఇంతకూ ఎవరు వారు ? వారి తలపాగా కథ ఏంటి ? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూపీలోని అయోధ్య పరిధిలో ఉన్న సరైరాశి గ్రామానికి సూర్యవంశి ఠాకూర్ వంశస్థుల 500 ఏళ్ల కల నెరవేరనుంది. 5 శతాబ్దాల తర్వాత ఇప్పుడీ వంశస్థులు తలపాగాలు ధరించారు. తమ పూర్వీకులను తలుచుకుంటూ సగర్వంగా పగిడీలు ధరించారు. తలపాగాలు ధరించడానికి 500 ఏళ్లు పట్టిందా అని ఆశ్చర్యపోతున్నారా..? దాని వెనుక ఓ పెద్ద కథే ఉంది.


ఐదు శతాబ్దాల క్రితం అయోధ్యలో రామ మందిరం కూల్చివేత సమయంలో చేసిన ప్రతిజ్ఞ ఇన్నాళ్లకు నెరవేరింది. రామ మందిరాన్ని కూల్చి అక్కడ బాబ్రీ మసీదు కట్టడాన్ని నిరసిస్తూ.. తమ తలపాగాలను తీసేశారు. అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చిన చోట మళ్లీ ఆలయాన్ని కట్టినప్పుడే తిరిగి తలపాగాలు ధరిస్తామని శపథం చేశారు. ఆ శపథం ప్రకారం గత 500 ఏళ్లుగా తలపాగాలు ధరించకుండా.. శ్రీరాముడి ఆలయ నిర్మాణం కోసం ఎదురుచూశారు. 


2019లో అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పుతో రామ మందిర నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. ఆ తర్వాత రామ మందిర నిర్మాణం చేపట్టి ప్రస్తుతం పూర్తి కావస్తున్న నేపథ్యంలో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ నెల 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో మళ్లీ తమ తలపాగాలను ధరించారు. అయితే ప్రారంభోత్సవం కంటే ముందే తలపాగాలు ధరించాలని నిర్ణయించుకున్నట్లు సూర్యవంశి ఠాకూర్‌లు వెల్లడించారు. తాము శ్రీరాముడికి సంబంధించిన వంశంగా సూర్యవంశి ఠాకూర్‌లు చెప్పుకుంటారు.


Also Read: Shoaib Malik Third Marriage: సానియా మీర్జాకు భారీ షాక్.. మళ్లీ పెళ్లి చేసుకున్న భర్త షోయబ్ మాలిక్


Also Read: TANA Elections: సంచలనం రేపిన 'తానా' ఎన్నికల్లో కొడాలి నరేన్‌ జయభేరి.. విజేతలు ఎవరెవరంటే..?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter