కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కి ఘోర ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న ఫ్లైట్‌లో దాదాపు 14 నిమిషాలు ట్రాఫిక్ కంట్రోల్ ఆగిపోయింది. సుష్మా స్వరాజ్ కేరళ నుండి దక్షిణాఫ్రికాకి ఓ విమానంలో ప్రయాణిస్తూ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అనుకోకుండా రాడార్స్ నుండి సిగ్నల్స్ ఆగిపోవడంతో పరిస్థితి అయోమయంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధ్యాహ్నం 2.08 గంటలకు సుష్మా స్వరాజ్ తిరువసంతపురం నుండి బయలుదేరి వెళ్లగా.. మారిషస్ ఎయిర్ స్పేస్ చేరుకోగానే, మాలే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను విమానం సంప్రదించలేకపోయింది.  సాయంత్రం 4:44 నిమిషాల నుండి 4:58 నిమిషాల వరకు ఈ అంతరాయం కలిగింది. వెంటనే మారిషస్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారు ప్రమాద సూచికను జారీ చేశారు. ఆ తర్వాత పరిస్థితి కొలిక్కి రావడంతో.. విమానం భద్రంగా గమ్యస్థానానికి చేరింది. 


అయితే ఈ అంతరాయానికి గల కారణాన్ని మాత్రం విమాన వర్గాలు బహిర్గతం చేయలేదు. సుష్మా స్వరాజ్ దక్షిణాఫ్రికాకి వెళ్తున్న క్రమంలో.. మార్గమధ్యంలో మారిషస్ దేశాన్ని కూడా సందర్శించారు. దక్షిణాఫ్రికాలో జరగనున్న బ్రిక్స్‌(బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల సదస్సులో సుష్మా స్వరాజ్ పాల్గొననున్నారు. మాలేలో దిగాక, ట్రాన్సిట్ హాల్ట్‌లో సుష్మా స్వరాజ్‌ని మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ గౌరవపూర్వకంగా కలిశారు.