వివాదాస్పద హిందూ మతప్రచారకుడు మరియు గతంలో బిగ్ బాస్‌ షోలో పాల్గొన్న స్వామి ఓమ్ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఒక ఆన్‌లైన్ వీడియో షూట్‌లో మాట్లాడుతూ డేరాబాబాగా పిలవబడుతున్న "రామ్ రహీం సింగ్ అసలు రేప్ చేశాడని గ్యారంటీ ఏమిటి.. అందుకు సాక్ష్యాలు ఏమీ లభించలేదు. కాబట్టి.. అతన్ని రేపిస్ట్ అని పిలవడం తప్పు" అని అభిప్రాయపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదేవిధంగా డేరాబాబా కూతురుగా పిలవబడుతున్న హనీప్రీత్ సింగ్‌పై కూడా పలు వ్యాఖ్యలు చేశాడు స్వామి ఓమ్.  తాను హనీప్రీత్ సింగ్‌ని ఢిల్లీలో కలిశానని, ఆమె నిజాయితీపరురాలని, తనకు ఎప్పుడూ మద్దతుగానే ఉంటానని కూడా ఆయన తెలిపారు.


వివాదాల్లో నిలవడం స్వామి ఓమ్‌కు కొత్తేమీ కాదు. గతంలో బిగ్‌బాస్ షోలో పాల్గొన్న ఈ హిందు సాధువు, అక్కడ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించి, షో నుండి బలవంతంగా బయటకు  పంపించబడ్డాడు. ఆ తర్వాత షో నిర్వాహకులు తనను చంపుతామని బెదిరించారని కూడా మీడియాకి తెలిపాడు.


ఆ తర్వాత సల్మాన్ ఖాన్‌ను ఐఎస్ ఏజెంట్ అని ప్రకటించి కూడా వార్తల్లోకెక్కాడు. ఇప్పుడు మళ్లీ రామ్ రహీం సింగ్‌ను సపోర్టు చేస్తూ మాట్లాడి వార్తల్లో నిలిచాడు.