Swati maliwal: స్వాతి మాలీవాల్ పై దాడిఘటన.. కేజ్రీవాల్ పీఏ పై జాతీయ మహిళ కమిషన్ సీరియస్..
Swati maliwal assult case: స్వాతీమాలీవాల్ ఘటనపై జాతీయా మహిళ కమిషన్ సీరియస్ గా స్పందించింది. వెంటనేఉ తమ మందు హజరు కావాలని, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ కు సమన్లు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Arvind Kejriwal PA Bibhav kumar Assult case: ఎన్నికల వేళ ఆప్ ఎంపీ స్వాతీమాలీవాల్ పై వేధింపుల ఘటన ఆప్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే దీనిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిచడంలేదంటూ, అపోసిషన్ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే ఇటీవల స్వాతీమాలీవాల్ ఘటనపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా.. దీనిపై వెంటనే చర్యలు తీసుకొవాలంటూ కోరారు. దీనిపై రంగంలోకిదిగిన ప్రత్యేక పోలీసులు..పి.ఎస్ కుష్వాహా ఇద్దరు సభ్యులతో కూడిన పోలీసులు.. స్వాతీమాలీవాల్ ను ఆమె నివాసానికి వెళ్లారు. స్వాతీ మాలీవాల్ , సీఎం కేజ్రీవాల్ ను కలవడానికి వెళ్లినప్పుడు ఏం జరిగింది, బిభవ్ కుమార్ వేధించి, దాడులకు పాల్పడిన ఘటనకు సంబంధించిన ఘటనను పూర్తిగా సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ గా స్పందించింది.
Read more: Dice Snakes: ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్.. చచ్చిపోయినట్లు నటిస్తున్న పాములు.. కారణం ఏంటో తెలుసా..?
బిభవ్ కుమార్ శుక్రవారం రోజు ఉదయం 12 గంటల లోపు తమ ముందు హజరు కావాలంటూ కూడా మహిళ కమిషన్ సమన్లు జారీ చేసింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎన్నికల వేళ స్వాతీమాలీవాల్ ఘటన దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమ ఎంపీకి న్యాయంచేయలేని వారు ప్రజలకు ఎలాంటి న్యాయం చేస్తారంటూ కూడా బీజీపీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. మరోవైపు దీనిపై కేజ్రీవాల్ ఎందుకు స్పందించడంలేదంటూ కూడా, తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఇక దీనిపై రాయ్ బరేలీ ఎన్నికల ఉన్న కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ సైతం స్పందించారు.
దీనిపై తొందరలోనే కేజ్రీవాల్ స్పందిస్తారని, బాధితురాలికి అండగా ఉంటారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇక దీనిపై తాను పోలీసులకు తన స్టేట్ మెంట్ ఇచ్చానని, దీనిపై రాజకీయాలు చేయోద్దని స్వాతీమాలీవాల్ ఎక్స్ వేదికగా కోరారు. దీనిపై పోలీసులు విచారణ జరిపి తగిన విధంగా చర్యలు తీసుకుంటారని ఆశీస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై ఆప్ సీనియర్ నేత.. ఎంపీ సంజయ్ సింగ్ సైతం స్పందించారు.
Read more: Viral Video: వామ్మో.. ఇలా చేస్తున్నాడేంటీ.. కాఫీలో ఉల్లిపాయల్ని ముంచి.. వైరల్ గా మారిన వీడియో..
ఆరోజు ఏజరిగిందంటే..?
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల జైలు నుంచి విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. కేజ్రీవాల్ ను కలవడానికి ఎంపీ స్వాతీమాలీవాల్ ఆయన నివాసానికి వచ్చారు. అక్కడ ఉన్న డ్రాయింగ్ రూమ్ లో.. వేచీ చూస్తుండగా, అక్కడికి వచ్చిన బిభవ్ కుమార్ అమర్యాదగా ప్రవర్తించినట్లు ఆమె వెల్లడించింది. అంతేకాకుండా.. దాడికి పాల్పడినట్లు పోలీసులకు తన వాంగ్మూలం కూడా ఇచ్చింది. ఈ ఘటనపై పార్టీ పరంగా కూడా బిభవ్ కుమార్ పై కఠిన చర్యలు ఉంటాయని పలువురు ఆప్ నేతలు పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter