Swati maliwal assults case: ఆప్ ఎంపీ స్వాతీమాలీవాల్ శుక్రవారం కోర్టులో హజరై సంచలనమైన వాంగ్మూలం ఇచ్చారు. తనపై కేజ్రీవాల్ పీఏ కాలితో తన్నుతూ దారుణంగా ప్రవర్తించాడని న్యాయమూర్తి ముందు తన బాధనుచెప్పుకున్నారు. స్వాతీ మాలీవాల్ తీస్ హజారీ బాగ్ కోర్టులో హజరయ్యారు. అంతేకాకుండా.. తనపై గత సోమవారం కేజ్రీవాల్ పీఏ ఏవిధంగా దాడిచేశారో తెలిపాడు. కేజ్రీవాల్ కోసం తాను డ్రాయింగ్ రూమ్ లో వెయిట్ చేస్తున్నానని, ఇంతలో అక్కడికి వచ్చిన బిభవ్ కుమార్ తన పట్లు దురుసుగా ప్రవర్తించాడని పేర్కొన్నారు. తనచెంప మీద ఏడేనిమిది సార్టు కొట్టాడని ఆమె చెప్పారు. తాను గట్టిగా అరుస్తు ప్రాధేయ పడుతున్న ఎవరు కూడా ఆపేసాహాసం చేయలేదన్నారు. అప్పటికే తన పొత్తికడుపుపై తన్నుతూ.. నోటికొచ్చినట్లు దూశించాడని ఆవేదన వ్యక్తం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Viral Video: ఓవరాక్షన్ చేస్తే ఇట్లనే ఉంటది మరీ.. బొక్కొ బొర్లా పడిన యువకుడు.. వీడియో వైరల్..


ఈ మేరకు ఆమె గురువారం తొలుత పోలీసులు ఫిర్యాదు చేశారు. తన జీవితంలో ఇలాంటి భయంకర పరిస్థితిని ఎదుర్కొలేదన్నారు.  డ్రాయింగ్ రూమ్ లో ఇటీవల జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్ ను కలిసేందుకు వెయిట్ చేస్తున్నాని అప్పుడు వచ్చిన నాపై దాడికి తెగబడ్డాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాపై చాలా కర్కషంగా ప్రవర్తించి, నువ్వేం చేసుకుంటావో.. చేసుకో.. మమ్మల్ని ఎవరు కూడా ఏంచేయలేరంటూ కొట్టాడని స్వాతీ మలీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు తాను ఎలాగోలా బైటకు వచ్చి, పోలీసులను కలిసి తన బాధను చెప్పుకున్నానని, ఆ తర్వాత రాజకీయం  కావోద్దని తిరిగి ఇంటికి వెళ్లిపోయినట్లు తెలిపారు. శుక్రవారం ఆమె మాత్రం పోలీసులకు ఫిర్యాదుచేసి, తీస్ హజారీ కోర్టులో న్యాయమూర్తి ముందు తన వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిపారు.


ఇదిలా ఉండగా.. శుక్రవారం రోజున దాడి ఆరోపణల నేపథ్యంలో.. ఆమెకు వైద్యులు టెస్టులు చేశారు. ఆమె శరీరం, ముఖంమీద అంతర్గత గాయాలు ఉన్నట్లు బైటపడినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో  స్వాతీమాలీవాల్ సెక్యురిటీ సిబ్బందితో వాగ్వాదం చేస్తున్న ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. దీనిలో స్వాతీమాలీవాల్.. సెక్యురిటీ సిబ్బందితో గొడవలు పడుతున్నారు. దీనిపై స్వాతీమాలీవాల్ ఎక్స్ వేదికగా స్పందించారు.


Read more: Dice Snakes: ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్.. చచ్చిపోయినట్లు నటిస్తున్న పాములు.. కారణం ఏంటో తెలుసా..?


ప్రతిసారిలాగే ఈసారి కూడా హిట్ మెన్ తనను తాను సెఫ్ చేసుకొవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉన్నారంటూ సెటైర్ లు వేశారు. ఇక.. ఇక్కడ హిట్ మెన్ ఎవరనేది మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు ఆప్ నేతలు స్వాతీమాలీవాల్,  కావాలని సీఎం కేజ్రీవాల్ పై లేని పోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. రాజకీయంగా ఆయనను ఎదుర్కొనలేక ఈ విధంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఆప్ నేతలు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈఘటన మాత్రం రాజకీయంగా తీవ్ర దుమారంగా మారింది. ఇక మరోవైపు ఇటీవల మధ్యంత బెయిల్  మీద విడుదలైన కేజ్రీవాల్, జూన్ 2 వరకు తిరిగి తీహార్ జైలులో వెళ్లిపోవాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter