Swiggy Delivery Boy Helps Zomato Delivery Boy: సోషల్‌ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా మనుషులు, జంతులకు సంబంధించి ఎన్నో వీడియోలు ఉంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని భయానకరమైనవిగా ఉంటాయి. ఇంకొన్ని మాత్రం మనసుకు హత్తుకునేలా ఉంటాయి. తాజాగా ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫుడ్ డెలివరీ కోసం రోడ్డుపై వెళుతున్న ఓ జోమాటో బాయ్‌కి స్విగ్గీ బాయ్ హెల్ప్ చేశాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్విగ్గీ, జోమాటోలు ఆన్ లైన్ ఫుడ్ డెలివరీకి సంబందించిన సంస్థలు అన్న విషయం తెలిసిందే. ఈ రెండిటి మధ్య తీవ్ర పోటీ ఉంటుంది. అయితే ఫుడ్ డెలివరీ చేసేది మనుషులే కాబట్టి.. ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారు. జోమాటో డెలివరి బాయ్ సైకిల్‌పై ఫుడ్ డెలివరికి బయలుదేరాడు. అదే మార్గంలో స్విగ్గీ డెలివరి బాయ్ బైక్‌పై ఫుడ్ డెలవరికి వెళ్తున్నాడు. అలా వెళుతున్న స్విగ్గీ డెలివరి బాయ్‌కి సైకిల్‌పై వెళుతున్న జోమాటో డెలివరి బాయ్ కనిపించాడు. దాంతో జోమాటో డెలివరి బాయ్ చేయి పట్టుకుని.. స్విగ్గీ డెలివరి బాయ్‌ బైక్ నడుపుకుంటూ ముందుకు తీసుకెళ్లాడు.



స్విగ్గీ డెలివరి బాయ్‌ సాయంతో జోమాటో డెలివరి బాయ్ సునాయాసంగా గమ్యం చేరుకున్నాడు. ఈ ఇద్దరి వెనకాలే అదే మార్గంలో కారులో వెళ్తున్న సనా అరోరా అనే మహిళ ఈ దృశ్యాన్ని తన మొబైల్ ఫోన్‌లో రికార్డు చేశారు. ఆపై తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. వీడియోను చూసిన అందరూ స్విగ్గీ డెలివరి బాయ్‌ని ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటికే 5 లక్షలకు పైగా లైక్‌లు, రెండు వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. ఇటీవల ముంబైలో కురిసిన వర్షాల కారణంగా ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ గుర్రంపై స్వారీ చేస్తూ వెళ్లిన విషయం తెలిసిందే. 


Also Read: Nidhhi Agerwal Pics: నిధి అగర్వాల్ అందాల ట్రీట్.. చూపు తిప్పుకోనివ్వని అందంకు..!


Also Read: హిందీ సినిమాల్లో నటిస్తారా.. అల్లు అర్జున్ ఏం చెప్పారో తెలుసా? బన్నీది మాములు బుర్రకాదు


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook