Kamal Haasan:  భాష విషయంలో హీరోల మధ్య వార్ కొనసాగుతోంది.  ఇటీవల బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్‌, కన్నడ హీరో సుదీప్ మధ్య వివాదం నడిచింది. ఇద్దరు ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధానికి దిగారు. ఎవరికైనా వారి మాతృ భాష ముద్దు అంటూ కౌంటర్లు ఇచ్చుకున్నారు. ఈక్రమంలో సీనియర్ నటుడు కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు.  హిందీని వ్యతిరేకించనని..ఇదే సమయంలో తన మాతృభాష తమిళానికి అడ్డుపడితే ఎంతవరకైనా వెళ్తానని స్పష్టం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినిమా ..రాజకీయాలు కవలపిల్లల లాంటివన్నారు. అదే నేను చేస్తున్నానని తేల్చి చెప్పారు. తమిళం వర్ధిల్లాలి అనడం తన బాధ్యత అని అన్నారు. దీనికి ఎవరు అడ్డువచ్చినా ఎదురుకొనేందుకు సిద్ధంగా ఉన్నానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారానికి రాజకీయాలు ఎలాంటి సంబంధం లేదన్నారు కమల్‌హాసన్. మాతృభాషను అందరూ గుర్తించుకోవాలని పిలుపునిచ్చారు.


హిందీని వ్యతిరేకించమని తాను చెప్పట్లేదన్నారు. గుజరాతీ, చైనీస్‌తోపాటు ఇతర భాషలు మాట్లాడాలని తెలిపారు. కమల్ స్వీయ నిర్మాణంలో విక్రమ్ సినిమా తెరకెక్కింది. ఈ మూవీకి లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించారు. అనిరుధ్‌ మ్యూజిక్ అందించారు. ఫహద్, విజయ్ సేతుపతి ముఖ్యపాత్రలు పోషించారు. జూన్ 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైర్, పాటల విడుదల వేడుకల చెన్నైలో అట్టహాసంగా జరిగింది. వేడుకలో కమల్ హాసన్, విజయ సేతుపతి, అనిరుధ్‌, లోకేష్‌ కనకరాజ్, నరేన్, కాళిదాస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కార్యక్రమంలో ఉదయ నిధి, శింబు, పార్తిబన్, దర్శకుడు కేఎస్ రమికుమార్ చీఫ్‌ గెస్ట్‌లుగా పాల్గొన్నారు.


Also read:KGF Chapter 2 OTT: ఓటీటీలో కేజీయఫ్‌ చాప్టర్‌ 2.. సినిమాను వీక్షించాలంటే డబ్బులు చెల్లించాల్సిందే!


Also read:UPI Cash Withdrawal: డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేకుండానే ATMలో క్యాష్ విత్ డ్రా చేయడం ఎలా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook