MK Stalin Speaking for India: కాగ్ రిపోర్ట్‌పై గురించి 7 మెగా స్కామ్‌ల గురించి తాను మాట్లాడనని.. అదంతా నిజమేనని కేంద్ర ప్రభుత్వమే అంగీకరిస్తున్నట్లుగా బీజేపీ ప్రభుత్వం అవినీతిని బయటపెట్టిన అధికారులను బదిలీ చేసిందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. అంత యాక్షన్ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాల హక్కులపై కూడా స్పందిస్తుందోమో చూడాలని అన్నారు. స్పీకింగ్ ఫర్ ఇండియా ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించి ఆయన.. అందులో ఆడియోలను ప్రచురిస్తున్నారు. ఇది యూట్యూబ్, పాడ్‌కాస్ట్ సైట్‌లు మొదలైన వాటిలో ప్రసారం అవుతోంది. ఇందుకు సంబంధించి "స్టేట్ అటానమీ: మై వాయిస్ ఫర్ ట్రూ కోఆపరేటివ్ ఫెడరలిజం" పేరుతో స్పీకింగ్ ఫర్ ఇండియా 3వ ఎపిసోడ్‌లో మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



"డీఎంకే తనకంటూ ప్రత్యేక సిద్ధాంతాలతో 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న పార్టీ మాత్రమే కాదు.. పార్లమెంట్‌లో మూడో అతి పెద్ద పార్టీగా ఉంది. అంతేకాకుండా భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న పార్టీ. డీఎంకే సిద్ధాంతాలకు కీలకం రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి. భారత దేశం సమాఖ్య దేశం. ఇక్కడ వివిధ జాతులు, భాషలు, సంస్కృతులు, ఆచారాలు కలిగిన ప్రజలు నివసిస్తున్నారు. మన ప్రజలకు అనేక మత విశ్వాసాలు ఉన్నాయి. వివిధ రకాల పూజలు ఉన్నాయి. వారికి రాజ్యాంగ హక్కులు కూడా ఉన్నాయి. ఈ విభేదాలు ఉన్నప్పటికీ మనం అందరం సామరస్యంగా జీవిస్తున్నాం. 


గుజరాత్ ముఖ్యమంత్రిగా రాష్ట్రాల హక్కుల గురించి మాట్లాడిన నరేంద్ర మోదీ.. ప్రధాని అయిన తరువాత రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారు. రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం వినడం ఇష్టం లేదు. రాజ్యాంగం ఇచ్చిన అధికారాల్లో కూడా రాష్ట్రాలను నడపనివ్వడం లేదు. బీజేపీ రాష్ట్రాలను రద్దు చేయాలని చూస్తోంది. లేనిపక్షంలో మున్సిపాలిటీలుగా ఏర్పాటు విభజించాలని భావిస్తోంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొని అభిప్రాయాలు చెప్పే ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి.. సత్తువలేని నీతి ఆయోగ్‌ను తీసుకువచ్చారు. 


మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి: https://podcasters.spotify.com/pod/show/mk-stalin/episodes/Episode-03-e2b8m9k


ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాల్సిన పనులకు కూడా కేంద్రం వాకిటిలో ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్రాల వాటాను కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. జీఎస్టీ వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఐసీయూలో ఉంది. నిధులు కేటాయింపు తగ్గడం వల్ల 19 ఏళ్లలో తమిళనాడు రాష్ట్రానికి 85 వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఇక నుంచి కూడా ప్రతి ఏటా మనకు రూ.10 వేల కోట్ల నష్టం వాటిల్లనుంది. ఉపాధి హమీ పనిని తగ్గించి.. జీతాలు ఇవ్వకుండా సాగదీస్తోంది. అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఇచ్చే నిధులను కూడా ఆపేస్తామని ఓ కేంద్ర మంత్రి చెబుతున్నారు. 


రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకునే వీలులేకుండా పోయింది. రాష్ట్రాల పరిపాలనను ఆపేందుకు యాక్షన్ ప్లాన్‌ను రూపొందిస్తోంది బీజేపీ. అందుకే తమిళనాడు ప్రజాప్రతినిధులు శాసనసభలో ఆమోదించిన 19 బిల్లులను ఆమోదించకుండా ఉండేందుకు బీజేపీ గవర్నర్‌ను ఉపయోగిస్తోంది. రాష్ట్రాల హక్కులను, చట్టసభల గౌరవాన్ని ఎంత చిన్నచూపు చూస్తున్నారో చూడండి.


ఇలా దేశాన్ని ఒకే పార్టీ, ఒకే నాయకత్వం, ఒకే అధికారంతో కూడిన ప్రధానమంత్రి వైపు నడిపించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పడానికి బదులు.. ప్రపంచంలోనే అతిపెద్ద భారత ప్రజాస్వామ్య వ్యవస్థను చిన్నాభిన్నం చేసి నాశనం చేస్తున్నారు. మొత్తం మీద బీజేపీ పాలనలో రాష్ట్ర హక్కులు నలిగిపోయాయి. మన రాజ్యాంగం ఇచ్చిన ఫెడరలిజం, ప్రజాస్వామ్యం ప్రజలతో పాటు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి. వారు చేసే దారుణమైంది ఏంటంటే.. రాష్ట్రాల విద్యాహక్కులో జోక్యం చేసుకోవడం.. పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో లక్షణం-ఒక సంస్కృతి-ఒక ప్రత్యేకమైన ఆలోచనా విధానం ఉంటుంది.


మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://on.soundcloud.com/ojwFz


వీటన్నింటినీ నాశనం చేసే విధానం జాతీయ విద్యా విధానం. ఈ విధంగా బీజేపీ పాలకవర్గం తీసివేసిన హక్కులను ఒక్కొక్కటిగా జాబితా చేయాల్సి వస్తే.. ఇంకా పది ఎపిసోడ్ల గురించి మాట్లాడవచ్చు. వీటన్నింటి నుంచి మనల్ని కాపాడుకోవడానికి మనకున్న ఏకైక కవచం రాష్ట్ర స్వయం ప్రతిపత్తి. నేడు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు యూనియన్‌ పాలన చివరి దశలో ఉన్నాయి. నియంతృత్వ పాలనను సృష్టించాలని అనుకుంటోంది. అందుకే వారు రాజ్యాంగం ప్రకారం పాలించలేదు. రాష్ట్రాలను గౌరవించడం లేదు. ప్రతిపక్ష పార్టీ పాలిత రాష్ట్రాలు వాటిని ఉంచుకుని లెక్కలేనన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడితే.. రాష్ట్ర ప్రభుత్వ జీతాలు పొంది రాష్ట్ర సంక్షేమానికి వ్యతిరేకంగా గవర్నర్లు పనిచేస్తున్నారు.  


 మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://amzn.to/3s2XnVq


 రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి సాధించాలంటే.. భారతదేశంలో సంకీర్ణ పాలన రావాలి. అందుకు ప్రజలు సిద్ధం కావాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ముందు మినీ పార్లమెంటరీ ఎన్నికలుగా భావించే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఓటు వేయబోయే ఓటర్లు ఈ విషయాన్ని గుర్తుంచుకుని ఓటు వేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. ముగింపులో ఈ ఎపిసోడ్‌ను సరిగ్గా విన్న వారు భారతదేశాన్ని ఇండియా అలయన్స్‌కి అప్పగించాలని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. రాష్ట్రాలను కాపాడుకుందాం.. భారతదేశాన్ని కాపాడుకుందాం.. భారత కూటమిని గెలిపిద్దాం.." అని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కోరారు.


Also Read: Chandrababu Case Updates: చంద్రబాబుకు ఊరట, మద్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు


Also Read: Animal : షాకింగ్ రన్ టైం తో యానిమల్.. సినిమాకి రెండు ఇంటర్వెల్స్..ఈ వార్త నిజమేనా


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి