Tamil Nadu Elections 2021: డీఎంకే విజయంపై ఎంకే స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
DMK President MK Stalin | ప్రజాస్వామ్యంలో ప్రజల ఆయుధమైన ఓటు హక్కుతో నేతలకు తీర్పు చెప్పనున్నారు. అయితే నాలుగు దశాబ్దాల తరువాత జయలలిత, కరుణానిధి (మరణానంతం) లేకుండా జరుగుతున్న ఎన్నికలు కనుక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
DMK President MK Stalin | తమిళనాడులో 6 కోట్ల మంది ఓటర్లు నేడు తమ ప్రభుత్వాన్ని నిర్ణయించనున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆయుధమైన ఓటు హక్కుతో నేతలకు తీర్పు చెప్పనున్నారు. అయితే నాలుగు దశాబ్దాల తరువాత జయలలిత, కరుణానిధి (మరణానంతం) లేకుండా జరుగుతున్న ఎన్నికలు కనుక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఒకే దశలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ నిర్వహిస్తున్నారు.
గతంలో జరిగిన రెండు వరుస ఎన్నికల్లో అన్నాడీఎంకేకు జయలలిత విజయాన్ని అందించారు. వరుసగా రెండు పర్యాయాలు సీఎం అయ్యారు. అనంతరం ఆమె ఆరోగ్యం క్షీణించి కన్నుమూశారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు తమిళనాడు వ్యాప్తంగా 13.8 శాతం ఓటింగ్ నమోదైనట్లు తమిళనాడు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సత్యబ్రత సాహూ తెలిపారు. భారీగా ఓటింగ్ జరుగుతుండటంపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే విజయం తథ్యమని వ్యాఖ్యానించారు. అధికార అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా ప్రజలు భారీ సంఖ్యలో ఓటింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు.
Also Read: Rajinikanth Casts Vote: ఓటు హక్కు వినియోగించుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్
అంతకుముందు నేటి ఉదయం డీఎంకే ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుమారుడు ఉదయనిధి స్టాలిన్, సతీమణితో కలిసి తేనమ్‌పేట్‌లోని సియెట్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో భారీగా పోలింగ్ నమోదవుతుందని, అధికార అన్నాడీఎంకేపై ప్రజల్లో వ్యతిరేకత వారిని భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా చేస్తుందన్నారు. భారీగా ఓటింగ్ నమోదు కావడం డీఎంకే విజయానికి సంకేతంగా భావిస్తున్నట్లు చెప్పారు.
Also Read: Assembly Elections: కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో ప్రారంభమైన పోలింగ్, ఓటేసిన ప్రముఖుల
డీఎంకే అభ్యర్థి, స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం జాతీయ మీడియా ఏఎన్ఐతో మాట్లాడారు. తమిళనాడు భారీ సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నటుడు ఉదయనిధి స్టాలిన్ చెన్నైలోని చెపాక్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉన్నారు. తన విజయంపై ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 3,998 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook