Heavy rains and floods in Tamil Nadu: చెన్నైతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో భారీ వరదలు పోటెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో అస్తవ్యస్తమైన చెన్నైకి మరో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యింది. నవంబర్ 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు తమిళనాడులో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు వాతావరణ శాఖ తమిళనాడుకు ప్రమాద సూచికగా ఆరెంజ్ అలర్ట్ (IMD issued Orange alert) జారీచేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Things to know: తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు:
Schools and colleges closed; స్కూల్స్, కాలేజీలకు 2 రోజులపాటు సెలవులు. 
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో చెన్నైతో పాటు మరో మూడు జిల్లాల్లో పాఠశాలలు, కాలేజీలకు తమిళనాడు సర్కారు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది.


సహాయ కార్యక్రమాల పర్యవేక్షణ నిమిత్తం 15 మంది ఐఏఎస్ ఆఫీసర్ల నియామకం:
తమిళనాడులో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (Chief Minister M K Stalin) 15 మంది ఐఏఎస్ ఆఫీసర్లను నియమించారు.


Community kitchens ద్వారా ఆహారం పొట్లాల సరఫరా:
వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి కమ్యూనిటీ కిచెన్స్ ద్వారా ఆహార పొట్లాలు సరఫరా చేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఇప్పటివరకు 2,02,350 మందికి ఆహారం అందించారు.


200 special monsoon medical camps; 200 స్పెషల్ మాన్సూన్ మెడికల్ క్యాంప్స్:
200 ప్రత్యేక మెడికల్ క్యాంపుల ద్వారా 3,776 మందికి తమిళనాడు సర్కారు వైద్య సహాయం అందించింది. 152 మంది జ్వరంతో బాధపడుతూ క్యాంపులకి రాగా 165 మంది స్కిన్ ఇన్‌‌ఫెక్షన్స్‌తో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. మరో 2600 మందికిపైగా జనం ఇతరత్రా జబ్బులతో బాధపడుతున్నారు.


నిండు కుండలా మారిన Chembarambakkam lake:
చెంబరంబక్కం చెరువు నిండుకుండలా మారింది. 85.4 అడుగులు చెరువు పూర్తి నీటిమట్టం కాగా ప్రస్తుతం 82.35 అడుగుల నీటిమట్టంతో నిండు కుండను తలపిస్తోంది. 2015లో ఈ చెరువు ఉప్పొంగి ప్రవహించడం వల్లే చెన్నైలో వరదలు పోటెత్తాయి.


Vegetables prices: భారీగా పెరిగిన కూరగాయల ధరలు:
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. ఉదాహరణకు వర్షాలు, వరదల (Heavy rains in Chennai) కంటే ముందుగా కిలో టమాట ధర రూ. 30 నుంచి రూ. 40 మధ్యే ఉండగా... తాజాగా రూ. 90- రూ100 వరకు పలుకుతోంది.