Tamil Nadu Governor Walkouts Assembly: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం రోజు గవర్నర్‌ ప్రసంగం చేయాల్సి ఉంది. ఏ రాష్ట్రంలోనైనా గవర్నర్‌ ప్రసంగంతోనే బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవడం సంప్రదాయం. తమిళనాడు బడ్జెట్‌ సమావేశాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సాధారణంగా అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలు వాకౌట్‌ చేస్తుంటారు. కానీ తమిళనాడులో గవర్నర్‌ అసెంబ్లీని బహిష్కరించడం గమనార్హం. ప్రసంగం బాగా లేదని, కీలక అంశాలు చెప్పలేదని చెబుతూనే గవర్నర్‌ ప్రసంగ చేయకుండా వెళ్లిపోయారు. ఇక తాను చేసిన సూచనలను పట్టించుకోకపోవడంతో అసెంబ్లీ నుంచి అర్ధాంతరంగా వీడారు. ఈ పరిణామం తమిళనాడులో తీవ్ర వివాదాస్పదమైంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Farmers Protest: మళ్లీ కదం తొక్కుతున్న రైతులు.. ఢిల్లీలో ఎక్కడిక్కడ నిర్బంధం, సరిహద్దులు బంద్‌?


తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను ఉద్దేశించి గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి అసెంబ్లీకి వచ్చారు. ప్రసంగం ప్రారంభించిన కొద్దిసేపటికే ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. 'సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు. నేను ప్రసంగం చదవడం లేదు. ప్రసంగంలో సరైన అంశాలు లేవు. ప్రసంగంలో చాలా అంశాలపై అభ్యంతరాలు ఉన్నాయి. అసలు నిజాలు, క్షేత్రస్థాయి పరిస్థితులకు ప్రసంగంలోని అంశాలు ప్రతిబించడం లేదు. ప్రసంగం ప్రారంభించే ముందు.. ముగిశాక జాతీయ గీతం జనగణమన ఆలపించడం ఆనవాయితీ. నేను పలుమార్లు చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ కారణంగా నేను ప్రసంగం చేయడం లేదు' అని చెప్పేసి ప్రసంగం ముగించారు. అనంతరం హడావుడిగా అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లారు.

Also Read: GPS Based Toll: ఇక ఫాస్టాగ్‌కు బై బై.. తెరపైకి కొత్త టోల్‌ విధానం.. ఇక హైవేపై రయ్యిన దూసుకెళ్లొచ్చు


పట్టుమని పది నిమిషాల సేపు అసెంబ్లీలో గవర్నర్‌ ఉండలేదు. గవర్నర్‌ ప్రసంగం మధ్యలోనే ఆపివేసి వెళ్లడంతో ముఖ్యమంత్రి స్టాలిన్‌, మంత్రులు, అధికార డీఎంకే పార్టీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్‌ తీరును తప్పుబట్టారు. గతేడాది బడ్జెట్‌ సమావేశాల సమయంలోనే గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఇదే తీరున వ్యవహరించారు. ఇటీవల కేరళ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇలాంటి పరిణామమే చోటుచేసుకుంది. అక్కడి గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ ప్రసంగంలోని కేవలం చివరి పేజీలోని ఒక పేరా మాత్రమే చదివి వెళ్లిపోయారు. 62 పేజీల ప్రసంగాన్ని కేవలం 84 సెకన్లలోనే ప్రసంగం ముగించారు. ఇప్పుడు అదే మాదిరి సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో మరోసారి తమిళనాడులో గవర్నర్‌, ప్రభుత్వం మధ్య విబేధాలు తారస్థాయికి చేరుకున్నాయి. పాలనాపరంగా కూడా సీఎం, గవర్నర్‌ మధ్య వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook