Madhava Rao Passes Away: కరోనా బారిన పడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నుమూత, ఫలితంపై ఆధారపడ్డ ఉప ఎన్నిక
Tamil Nadu Elections 2021: ఇటీవల తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ నేత కరోనా బారిన పడి కన్నుమూశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పీఎస్‌డబ్ల్యూ మాధవరావు గత నెలలో కోవిడ్19 బారిన పడ్డారు. ఆదివారం చికిత్స పొందుతూనే మృతి చెందారు.
Madhava Rao Dies: కరోనా మహమ్మారి ఓ ఎమ్మెల్యే అభ్యర్థిని బలితీసుకుంది. ఇటీవల తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ నేత కరోనా బారిన పడి కన్నుమూశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పీఎస్‌డబ్ల్యూ మాధవరావు గత నెలలో కోవిడ్19 బారిన పడ్డారు. గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న మాధవరావు ఆదివారం చికిత్స పొందుతూనే మృతి చెందారు.
శ్రీవిల్లిపుత్తూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మాధవరావు పోటీ చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు మే 2న ప్రకటించనున్నారు. ఒకవేళ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మాధవరావు విజయం సాధించినట్లయితే ఉప ఎన్నికలు రానున్నాయి. ఎన్నికలు పూర్తయిన తరువాత అభ్యర్థి చనిపోవడంతో ఫలితాల వరకు ఎదురుచూడాల్సి ఉంటుంది. కరోనా(CoronaVirus) బారినపడ్డ మాధవరావు మృతిచెందారని తమిళనాడు, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి, ఏఐసీసీ కార్యదర్శి సంజయ్‌దత్ వెల్లడించారు.
Also Read: Pawan Kalyan: హోం క్వారంటైన్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఫ్యాన్స్ టెన్షన్ టెన్షన్
శ్రీవిల్లిపుత్తూర్ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి మాధవరావు కోవిడ్19(Covid-19) బారిన పడి కన్నుమూశారు. మాధవరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు. తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాలకు ఏప్రిల్ 6న ఒకే విడతలో పోలింగ్ జరిగింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఇతర రాష్ట్రాలతో కలిపి మే 2న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.
భారతదేశంలో కరోనా మహమ్మారి రికార్డులు తిరగరాస్తోంది. గతంలో ఎన్నడూ లేదనంగా దేశంలో గడిచిన 24 గంటల్లో భారీగా కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో తాజాగా 1,52,879 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. తొలిసారిగా ఒకరోజులో లక్షన్నర కేసులను భారత్ నమోదు చేయగడం గమనార్హం. తాజాగా కేసులతో కలిపితే దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,33,58,805కు చేరింది. అదే సమయంలో గడిచిన 24 గంటలలో 839 మందిని కరోనా మహమ్మారి బలిగొంది.
Also Read: Corona Positive Cases: భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ, ఒకరోజులో తొలిసారిగా లక్షన్నర కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook