అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వేగంగా కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో తమిళనాడు ప్రభుత్వం ఆరు అడుగుల ఎత్తులో గోడ నిర్మించింది. ఏపీకి నిత్యవసరాలు సరఫరా చేసే ప్రధాన దారుల్లో గోడల నిర్మించడంపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తీసుకున్న నిర్ణయం తీవ్ర స్థాయిలో వివాదాలకు తావిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also: Telangana COVID-19 updates: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు


ఈక్రమంలో కరోనా కట్టడికి ఏపీ సరిహద్దు ప్రాంతంలో గోడలను నిర్మించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు నుండి ఏపీకి వెళ్లే దారిలోని చిత్తూరు జిల్లాలోని మూడు సరిహద్దు ప్రాంతాల్లో 6 అడుగుల ఎత్తులో భారీ గోడలు నిర్మించడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో స్థానికంగా ఉద్రిక్తతలకు దారి తీసింది. చిత్తూరు జిల్లా పరిధిలోని పలమనేరు సమీపంలోని గుడియత్తాం వెళ్లే రహదారి, తిరుత్తణి మార్గంలోని శెట్టింతంగాళ్ తో పాటు బొమ్మ సముద్రం నుండి తమిళనాడు వెళ్లే మార్గాలకు అడ్డంగా ఏకంగా 6 ఫీట్ల ఎత్తులో గోడ నిర్మించారు.


 గోడల నిర్మాణంపై చిత్తూరు జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఏపీ ఉన్నతాధికారులు తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదిలావుండగా రహదారులకు అడ్డంగా గోడలను కట్టడం పై చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సేవలు, నిత్యావసర సరుకులు, ఇతర రవాణాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు పేర్కొంటున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..