Tamilnadu: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమ్మ హెలీకాప్టర్‌ను ఎయిర్ అంబులెన్స్‌గా మార్చేందుకు నిర్ణయించారు. తమిళ ఆరోగ్యశాఖ దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin)ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలకు మేలు చేకూర్చేందుకు అనువైన పధకాల్ని ప్రవేశపెడుతున్నారు. ఇప్పుడు కొత్త ఎయిర్ అంబులెన్స్ ప్రవేశపెట్టనున్నారు. 2006లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత జయలలిత ప్రభుత్వం ఓ హెలికాప్టర్ కొనుగోలు చేసింది. ముఖ్యమంత్రిగా జయలలిత పర్యటనల కోసం దీన్ని సిద్ధం చేశారు. ముఖ్యమంత్రితో పాటు 14 మంది ప్రయాణించేందుకు అవసరమైన వసతులన్నీ ఇందులో ఉన్నాయి. తరువాత అధికారంలో వచ్చిన డీఎంకే ప్రభుత్వం పెద్దగా ఈ ఛాపర్‌ను వినియోగించలేదు. 


2011లో తిరిగి అధికారంలో వచ్చిన జయలలిత(Jayalalitha) పూర్తిస్థాయిలో ఈ హెలీకాప్టర్‌ను వినియోగించుకున్నారు. అమ్మ హెలీకాప్టర్‌గా ముద్రపడిన ఈ ఛాపర్‌ను ..అమ్మ మరణం తరువాత ముఖ్యమంత్రి పళనిస్వామి కొద్దిరోజులే వినియోగించారు. 2019 వరకూ మీనంబాక్కం విమానాశ్రయానికే పరిమితమైంది.కొత్తగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎంకే స్టాలిన్( MK Stalin)అసలు ఛాపర్ ప్రయాణాలకే దూరంగా ఉంటున్నారు. ఎక్కడికి వెళ్లినా రైలు, విమానం లేదా రోడ్డు ప్రయాణాలనే ఎంచుకుంటున్నారు. అందుకే ఇప్పుడు ఈ ఛాపర్‌ను ఎయిర్ అంబులెన్స్‌గా (Air Ambulance)తీర్చిదిద్దాలని ఎంకే స్టాలిన్ నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా తమిళనాడు ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. అమ్మ హెలీకాప్టర్‌ను ఎయిర్ అంబులెన్స్‌గా తీర్దిదిదే పనిలో పడింది. ఇప్పటి వరకు ఈ హెలికాప్టర్‌ 2 వేల 449 గంటలు మాత్రమే ప్రయాణించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, వైద్య కళాశాలల ఆవరణల్లో హెలికాప్టర్‌ ల్యాండింగ్, టేకాఫ్‌కు తగ్గ వసతులు ఉన్న దృష్ట్యా, అత్యవసర వైద్య సేవలకు ఎయిర్‌ అంబులెన్స్‌గా ఉపయోగపడనుంది. అమ్మ హెలికాప్టర్‌‌తో(Amma Helicopter) రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది.  


Also read: Supreme Court: దేశంలోని ప్రధాన హైకోర్టులో మరో 16 మంది న్యాయమూర్తుల నియామకం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook