MK Stalin Hospitalised: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన.. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకునేందుకు ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్టాలిన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న దానిపై ఎటువంటి ప్రకటన వెలువడలేదు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాక.. సీఎం స్టాలిన్ రెండు రోజుల పాటు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. కరోనా లక్షణాలు ఎక్కువవడంతో ఆసుపత్రిలో చేరారనే ప్రచారం జరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాను కరోనా బారినపడినట్లు రెండు రోజుల క్రితం స్టాలిన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. కాస్త నీరసంగా అనిపించడంతో కోవిడ్ పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని, అలాగే కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.


ఈ నెల 11, 12 తేదీల్లో స్టాలిన్ ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. అంతకుముందు 8,9 తేదీల్లో తిరువాన్నమలై జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో భారీగా జనం పాల్గొన్నప్పటికీ స్టాలిన్ మాస్క్ ధరించలేదు. ఈ క్రమంలోనే కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. సీఎం స్టాలిన్ త్వరగా కోలుకోవాలని తమిళనాడు ప్రజలు, డీఎంకె శ్రేణులు కోరుకుంటున్నారు.


పీఎంకె చీఫ్ డా.రామదాస్ కూడా కోవిడ్‌తో ప్రస్తుతం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం తమిళనాడులో రోజుకు 2 వేల పైచిలుకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇందులో ఒక్క చెన్నైలోనే 30 శాతం కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో 18,282 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 


[[{"fid":"237831","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


(స్టాలిన్ చేరికపై కావేరీ ఆసుపత్రి వర్గాల ప్రకటన)


Also Read: టీ20 సిరీస్‌కు కోహ్లీ, బుమ్రా దూరం.. కుల్దీప్‌ వచ్చేస్తున్నాడు! ఫ్యాన్స్‌కు ఓ గుడ్‌న్యూస్‌  


Also Read: Justice For Koratala Shiva: కొరటాల శివ సెటిల్మెంట్ వ్యవహారం ఏంటి?



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook