Tamilnadu lockdown: మరో రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్, మే 10 నుంచి 24 వరకూ..
Tamilnadu lockdown: దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా మహమ్మారి కట్టడికి రాష్ట్రాలు లాక్‌డౌన్ బాట పడుతున్నాయి. మరో రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించారు.
Tamilnadu lockdown: దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా మహమ్మారి కట్టడికి రాష్ట్రాలు లాక్‌డౌన్ బాట పడుతున్నాయి. మరో రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మూడు రోజుల్నించి పరిస్థితి మరీ దారుణంగా మారింది. రోజూ 4 లక్షలకు పైగా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్( Lockdown), లేదా పాక్షిక కర్ఫ్యూ(Curfew) అమలు చేస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా తమిళనాడులో సంపూర్ణ లాక్‌డౌన్ అమల్లోకి వస్తోంది.
తమిళనాడు(Tamilnadu)లో ఈ నెల 10 నుంచి 24వ తేదీ వరకూ అంటే రెండు వారాల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ ( Lockdown) విధిస్తున్నట్టు తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది. మద్యాహ్నం 12 గంటల వరకూ అత్యవసర సేవలకు అనుమతి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.లాక్‌డౌన్ సమయంలో బ్యాంకులు 50 శాతం సిబ్బందితో పని చేయనున్నాయి.రేషన్ షాపులకు అనుమతి ఉంటుంది. అటు రెస్టారెంట్లలో పార్శిల్ సౌకర్యం మాత్రమే ఉంటుంది. క్యాబ్, ఆటో సేవల్ని కేవలం ఆసుపత్రి, వివాహ, అంత్యక్రియలకు మాత్రమే అనుమతించనున్నారు.
Also read: India Corona Update: కొనసాగుతున్న కరోనా ఉధృతి, అత్యధికంగా 4.14 లక్షల కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook