Madurai Worker Killed: తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. బతికుండగానే ఓ వ్యక్తిని పూడ్చేశారు. అయితే కావాలని పూడ్చలేదు. కూలీలు పొరపాటున అలా చేసేశారు. తర్వాత పూడ్చేసిన వ్యక్తిని తీసే క్రమంలో అతను అనూహ్యరీతిలో ప్రాణాలు కోల్పోయాడు. మధురైలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధురైలోని వికలాంగుడి సమీపంలోని రామమూర్తి నగర్ వద్ద డ్రైనేజి పైపుల పని జరుగుతోంది. చాలా మంది కూలీలు ఆ పనికి వచ్చారు. పనిలో భాగంగా సతీష్ అనే కార్మికుడు 11 అడుగుల లోతున్న డ్రైనేజీ గుంతలోకి దిగాడు. అయితే లోపల పనిచేస్తున్న సతీష్ ను గమనించకుండానే పైన ఉన్న కూలీలు.. డ్రైనేజీ పైపులపై మట్టి పోశారు. పూర్తిగా కప్పేశారు. దీంతో గుంతలోనే మట్టిలో కూరుకుపోయాడు కార్మికుడు సతీష్. కొంత సేపటి తర్వాత సతీష్ గుంత లోపలే ఉన్నాడని గ్రహించిన కూలీలు కలవరపడ్డారు. సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సాయంతో కప్పేసి మట్టిని తీసే ప్రయత్నం చేశారు.


అయితే జేసీబీ మట్టి తీస్తుండగా దాని హ్యాండ్ లోపల ఉన్నా కార్మికులు సతీష్ ను తాకింది. జేసీబీ హ్యాండ్ తలను బలంగా తాకడంతో.. సతీష్ తల తెగిపోయింది. దీంతో స్పాట్ లోనే సతీష్ చనిపోయాడు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి వచ్చేలోపే ఈ ఘోరం జరిగిపోయింది. ఈ ఘటనతో కూలీలంచా షాకయ్యారు. తమ సహచరుడిని చంపేసుకున్నామని కన్నీళ్లు కార్చారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. వర్క్ ఇంజినీర్ సికందర్, పర్యవేక్షకుడు బాలుతో పాటు జేసీబీ ఆపరేటర్ సురేశ్ ను అరెస్ట్ చేశారు.కార్మికుడు చనిపోయిన ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి  స్టాలిన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుడు కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు.


READ ALSO:Hyderabad Minor Girl Gang Rape: దుబాయ్ చెక్కేసిన ఎమ్మెల్యే కొడుకు? గ్యాంగ్ రేప్ కేసును నీరుగార్చేపనిలో బడా నేత?


READ ALSO: Kakinada Rape Incident: కరోనా మందు పేరుతో మత్తు మందు ఇచ్చి.. బాలికపై హాస్టల్ కరస్పాండెంట్ రేప్..  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook