Udayanidhi Stalin: తమిళనాడులో కొత్త వివాదం రాజుకుంది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ ఆ రాష్ట్ర మంత్రి, ముఖ్మమంత్రి తనయుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. విశ్వ హిందూపరిషత్, బీజేపీ ఇతర సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంలో సనాతన నిర్మూలన అంశంపై నిన్న శనివారం నాడు ఓ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ అతిధిగా హాజరై చేసిన వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని స్టాలిన్ తెలిపారు. సనాతనాన్ని కేవలం వ్యతిరేకించడం ఒక్కటే సరిపోదని..పూర్తిగా తొలగించాలని స్పష్టం చేశారు. ఇది తిరోగమన సంస్కృతికి నిదర్శనమని, ప్రజల్ని కులాల పేరిట విభజించిందన్నారు. సనాతనం సమానత్వానికి, సాధికారతకు వ్యతిరేకతమన్నారు. సనాతర ధర్మం అనేది కరోనా, మలేరియా, డెంగ్యూ వంటిదన్నారు. 


ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. సనాతనాన్ని నిర్మూలించాలంటూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సహా హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా, అవమానకరంగా ఉన్నాయంటూ సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మత విశ్వాసాలలు దెబ్బతీసినందున ఉదయనిధి స్టాలిన్‌పై కేసు పెట్టాలని పోలీసుల్ని కోరారు.  ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఉదయనిధి అన్ని మతాల్ని సమానంగా చూడాలని, ఓ మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు.


ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సైతం మండిపడుతున్నారు. తమిళనాడులో కొందరి నిజ స్వరూపం ఇప్పుడు బయటపడుతోందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఆరోపించారు. సనాతనం శాశ్వతమైందని, ఇలాంటి వ్యాఖ్యలతో ఏం నష్టం జరగదన్నారు. ఇక మరో బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ సైతం ఈ వ్యాఖ్యలపై స్పందించారు. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న డీఎంకే పార్టీ నేత ఉదయనిధి స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రజలంతా గమనిస్తున్నారని. ఆ కూటమిలోని ఇతర పార్టీలు దీనికి సమాధానం చెప్పాలన్నారు. 


Also read: Trains Cancelled: దేశంలో ఆ మూడ్రోజులు 300 రైళ్లు రద్దు, కారణమేంటంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook