తమిళనాడులో బీజేపీ తన పొత్తును ఖరారు చేసుకుంది. ప్రస్తుత అధికార పార్టీ అన్నాడీఎంకేతో జోడికట్టేందుకు సిద్ధమైంది. తాజాగా జరిగిన పొత్తు ప్రకారం అన్నాడీఎంకే 27, పీఎంకే 7 స్థానాల్లో పోటీ చేస్తుండగా బీజేపీ 5 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఈ మేరకు కేంద్రం మంత్రి, బీజేపీ సీనియర్ నేత పీయూష్ గోయెల్ ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్డీయేలో అన్నాడీఎంకే చేరిక ఖరారైందని పీయూష్ పేర్కొన్నారు. లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ, అన్నాడీఎంకే కలిసి పనిచేస్తాయని పీయూష్ గోయెల్ తెలిపారు. పుదుచ్చేరి ఎన్నికల్లోనూ తాము కలిసి పోటీ చేస్తామని పేర్కొన్నారు


పొత్తులపై చర్చించేందుకు ఈ రోజు అన్నాడీఎంకేతో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ భేటీ అయ్యారు. ఈ భేటీలో కొన్ని స్థానాల్లో బీజేపీ పట్టుబట్టడంతో దీనికి అన్నాడీకే సరేమిరా అంది. దీంతో పొత్తుపై ప్రతిష్ఠంభన నెలకొంది. ఈ భేటీ ముగింపు నాటికి అన్ని సర్దుకుపోయాయి. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే కాంగ్రెస్ తో జతకట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే బీజేపీ కూటమిలో చేరేందుకు మొగ్గుచూపింది.