Arvind Kejriwal: 2022 ఎన్నికలే లక్ష్యం- నేడు పంజాబ్‌కు అర్వింద్ కేజ్రివాల్!
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పంజాబ్‌పై మరింత పట్టు సాధించేందుకు కసరత్తు ముమ్మరంగా చేస్తోంది. అప్ నేత, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ నేడు పంజాబ్‌లో పర్యటించనున్నారు.
Delhi CM Arvind Kejriwal to attend the APP’s ‘Tiranga Yatra’ in Pathankot on today: వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేఫథ్యంలో పంజాబ్‌పై ప్రత్యేక దృష్టి సారించింది ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్). అప్ జాతీయ కన్వినర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ నేడు (డిసెంబర్ 2 గురువారం) పంజాబ్‌లో (Arvind Kejriwal Punjab Visit) పర్యటించనున్నారు. పఠాన్‌కోట్‌లో నిర్వహించనున్న 'తిరంగ యాత్ర'లో (AAP's 'Tiranga Yatra') పాల్గొననున్నారు కేజ్రీవాల్.
ఈ కార్యక్రమంలో అర్వింద్ కేజ్రీవాల్‌తో పాటు.. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ కీలక నేత మనీశ్ సిసోడియా (AAP leader Manish Sisodia) కూడా పాల్గొననున్నారు. సిసోడియా ఇప్పటికే పంజాబ్‌లో 5 రోజుల పర్యటనలో ఉన్నారు.
ఏమిటి ఈ తిరంగ యాత్ర..
2022లో వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు క్యాడెర్‌ను పెంచుకునే పనిలో పడింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇందులో భాగంగానే తిరంగ యాత్ర పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఈ పార్టీ.. ఇప్పుడు దేశంలోని ఇతర రాష్ట్రాలపై పట్టు సాధించేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.
కేజ్రీవాల్ పంజాబ్ పర్యటన ఇది ఆరోసారి..
2022 ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ పంజాబ్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. గడిచిన రెండు నెలల్లో పంజాబ్‌లో ఆయన ఆరో సారి పర్యటించనుండటమే (Punjab Assembly elections) ఇందుకు ఉదాహరణగా. పంజాబ్ ఎన్నికలపై వచ్చే ఏడాది తొలినాళ్లలోనే ప్రకటన వెలువడే అవకాశముంది.
2017లో రెండో అతిపెద్ద పార్టీగా ఆప్..
పంజాబ్‌లో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అప్.. 20 సీట్లు గెలిచి రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ కారణంగానే ఈ సారి మరింత పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ.
పంజాబ్‌లో 2017 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 77 సీట్లు గెలిచి.. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు స్పష్టమైన మెజారిటీని సాధించింది. ఫలితంగా.. 10 ఏళ్ల పాటు కొనసాగిన శిరోమణి అకాలీ ధల్-బీజేపీల కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. గత ఎన్నికల్లో శోరోమణి అకాలీ ధల్‌కు 15 సీట్లు రాగా.. బీజేపీ మూడు స్థానాలకే పరిమితమైంది.
Also read: Mark Zuckerberg case : ఫేస్‌బుక్‌లో పోస్ట్‌పై జుకర్‌బర్గ్ పై కేసు, అఖిలేష్ అభిమాని చేసిన పని ఇది
Also read: Parliament Fire Today: పార్లమెంట్ లో అగ్ని ప్రమాదం.. కుర్చీలు, కంప్యూటర్లు దగ్ధం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook