ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లి అక్కడ భావోద్వేగానికి లోనయ్యారు. గోరఖ్‌పూర్‌లో "ఏక్ దియా - షహీదో కే నామ్" అనే కార్యక్రమానికి హాజరైన ఆయన కొద్ది క్షణాలు కన్నీళ్లపర్యంతమయ్యారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పించేందుకు నిర్వహించిన ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆద్యంతం అక్కడి ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తర్వాత పాఠశాల విద్యార్థులకు పండ్లు, మిఠాయిలు, పాఠ్యపుస్తకాలు తన చేతుల మీదుగా అందించారు. అలాగే వికలాంగులకు వీల్ ఛెయిర్స్ కూడా అందించారు. ఆ తర్వాతఅక్కడి అధికారులతో సమావేశమైన ఆదిత్యనాథ్ వెంటనే ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రపోజల్స్ ఏమిటో తెలియజేయవలసిందిగా అడిగారు. ప్రైమరీ స్కూలు, అంగన్‌వాడీ సెంటరు, క్రీడా మైదానం, త్రాగునీటి సరఫరా ప్లాంటు ఆ ప్రాంతానికి అవసరమని, వాటిని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రపోజల్స్ పంపించవలసిందిగా కోరారు. 


 < >