Telangana ban on UP potatoes In election heat, a hot potato: తెలంగాణలో ప్రస్తుతం ఆలు సాగు పెరిగింది. దీంతో యూపీలోని కోల్డ్ స్టోర్స్‌లోని ఆలుగడ్డల నిల్వలపై ఎఫెక్ట్‌ పడింది. దీంతో యూపీ రైతులు తెలంగాణ ప్రభుత్వంపై, ఇక్కడి సర్కార్‌‌కు సపోర్ట్ చేసే పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై (MIM Chief Asaduddin Owaisi) ఇప్పుడు యూపీ రైతులు మండిపడుతున్నారు. ఆగ్రా సమీపంలోని ఖండౌలీకి చెందిన ఆరెకరాల బంగాళదుంప రైతు (Potato farmer) మహ్మద్ అలంగీర్ కూడా ఒవైసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం పార్టీ రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (Uttar Pradesh Assembly elections) పోటీ చేస్తున్నందుకు కాదు... ఉత్తరప్రదేశ్‌ నుంచి ఆలుగడ్డల దిగుమతిని నిషేధించిన పార్టీకి సపోర్ట్ చేస్తున్నందుకు మహ్మద్ అలంగీర్‌‌కు కోపం వచ్చింది. టీఆర్ఎస్‌ ప్రభుత్వం (TRS‌) యూపీ నుంచి బంగాళాదుంపలను దిగుమతి చేసుకోవడం ఆపేసింది. మరి ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఒవైసీ (Owaisi) ఇక్కడెలా ప్రచారం చేస్తాడంటూ ఆగ్రాలోని (Agra) ఆలూ ఉత్పాదక్ కిసాన్ సమితి ప్రధాన కార్యదర్శి అయిన అలంగీర్ ప్రశ్నించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి రోజు దాదాపు 100 ట్రక్కులు దాకా ఆలుగడ్డలు యూపీ నుంచి తెలంగాణకు వెళ్లేవని ఆలంగీర్ చెప్పారు. అందులో 50-60 ట్రక్కులు ఒక్క ఆగ్రా నుంచే వెళ్లుండేవని పేర్కొన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడులకు కలిపి వెళ్లే దాదాపు 700-800 ట్రక్కుల ఆలగడ్డల ఎగుమతిలో దాదాపు మూడు వంతుల వాటా యూపీదే అని పేర్కొన్నారు. 


యూపీ రైతులు బంగాళాదుంపల సాగు అక్టోబర్‌‌-నవంబర్ మధ్య ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 20-మార్చి 10 వరకు పంట సాగు చేస్తారు. వారు సాధారణంగా పంట సమయంలో దాదాపు ఐదో వంతు మాత్రమే విక్రయిస్తారు. మిగతా పంటను అంతా నవంబర్ వరకు విక్రయించేందుకుగాను కోల్డ్ స్టోరేజ్‌లలో నిల్వ ఉంచుతారు. 


అయితే గతేడాది యూపీలో ఆలు భారీగా పండింది. దీంతో చాలా పంట నిల్వను కోల్డ్ స్టోరేజ్‌లలో నిల్వ ఉంచారు. అయితే తెలంగాణాతో పాటు మరికొన్ని రాష్ట్రాలు ఆలు దిగుమతులను ఆపేయడంతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ ఖండౌలీలో ఒక కోల్డ్ స్టోరేజ్‌ యజమాని దూంగర్ సింగ్ చౌదరి చెప్పారు. ఎందుకంటే ఫిబ్రవరిలో రైతులు మళ్లీ కొత్తగా వచ్చిన పంటను తీసుకొస్తారని.. ఆ బంగాళాదుంపలను నిల్వ చేయాలంటే స్థలం కోసం ఇప్పుడున్న వాటిని రోడ్డుపై పడవేయాల్సి వస్తుందని అన్నారు.


Also Read : Bus Ticket For Chick: కోడిపిల్లకు బస్సులో రూ.50 టికెట్.. ఆర్టీసీ కండెక్టర్ ఘనకార్యం


తెలంగాణలో (Telangana) ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా Sangareddy District) జహీరాబాద్ పరిధిలో 3,500-4,000 ఎకరాల్లో ఆలు సాగవుతోంది. తెలంగాణ బంగాళాదుంపలను పండించడానికి అనుకూలమైన ప్రాంతం అని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు ఆలుగడ్డ పంట సాగు విస్తీర్ణాన్ని లక్ష ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువకే పెంచడానికి కూడా తెలంగాణ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ఇక తాజాగా తెలంగాణలో పండించిన ఆలుకు ఇక్కడ ఫుల్ డిమాండ్ ఉంది. తెలంగాణ అంతటికీ ఇక్కడి ఆలుగడ్డలే సరిపోతాయి.. ఆగ్రాలోని కోల్డ్ స్టోర్స్‌పై ఆధారపడాల్సిన అవసరం లేదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. దీంతో ఇప్పుడు యూపీ రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు. తాము పండించి, నిల్వ చేసిన ఆలును కొనుగోలు చెయ్యడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Also Read : Dog Bite CCTV Footage: నాలుగేళ్ల బాలికపై వీధి శునకాల దాడి.. చిన్నారికి తీవ్ర గాయాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి