దివంగత మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారి వాజ్‌పేయి మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విలువలు పాటించిన గొప్ప నాయకుడు వాజ్‌పేయి అని కీర్తించిన కేసీఆర్.. నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరం శ్రమించిన గొప్పనేతగా దివంగత ప్రధానిని అభివర్ణించారు. వాజ్‌పేయి సేవలను, పరిపాలనను కీర్తిస్తూ.. యావత్‌ ప్రపంచానికి వాజ్‌పేయి ఆదర్శమని కేసీఆర్‌ కొనియాడారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 



ఇదిలావుంటే, మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతి పార్టీలకు అతీతంగా నేతలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ముఖ్యంగా వాజ్‌పేయితో సాన్నిహిత్యం కలిగిన బీజేపీ నేతలు ఆయన ఇక లేరనే దుర్వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో వాజ్‌పేయికి నివాళి ఘటిస్తూ బీజేపీ నేత కిషన్‌ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. వాజ్‌పేయి మృతిపట్ల బీజేపీ నేతలు లక్ష్మణ్‌, దత్తాత్రేయ, రామచంద్రరావు, చింతల తమ ప్రగాఢ సంతాపం ప్రకటించారు.