Telangana Exit Poll Results 2024: తెలంగాణలో బీజేపీ డిజాజిట్ కోల్పోయే లోక్ సభ స్థానం అదేనా..సర్వే సంస్థల జోస్యం అదేనా..!
Telangana Exit Poll Results 2024: దేశ వ్యాప్తంగా అన్ని సర్వే సంస్థలు మరోసారి బీజేపీ నేతృత్వంలోని NDA తిరిగి అధికారంలోకి రాబోతుందనే విషయం సర్వేలు స్పష్టం చేశాయి. అటు తెలంగాణలో కూడా బీజేపీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. కానీ తెలంగాణలోని ఓ పార్లమెంట్ సీటులో మాత్రం కనీసం డిపాజిట్ దక్కదని సర్వేలు చెబుతున్నాయి.
Telangana Exit Poll Results 2024: ముందు నుంచి భారతీయ జనతా పార్టీ చెప్పినట్టే.. అప్ కీ బార్ 400 పార్ అంటూ ఈ సారి ఎన్నికల్లో బీజేపీ కూటమి 400 సీట్లు గెలుస్తుందని చెబుతున్నా.. ఒకటి రెండు సర్వే సంస్థలు మాత్రమే ఎన్టీయే 400 సీట్లు క్రాస్ చేస్తుందని చెబుతున్నాయి. అటు తెలంగాణలో కూడా గతంలో ఎన్నడు లేనంతగా ఎక్కువ సీట్లు గెలుచుకొని మొదటి స్థానంలో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. ఎగ్జిట్ పోల్ సర్వేలతో తెలంగాణ బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
అందులో గతంలో భారతీయ జనతా పార్టీ గెలిచిన ఆదిలాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్ స్థానాలతో పాటు చేవెళ్ల, మల్కాజ్ గిరి, జహీరా బాద్ స్థానల్లో ఖచ్చితంగా గెలుస్తాయని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. మెదక్, మహబూబ్ నగర్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీతో బీజేపీ హోరాహోరీగా తలపడనుందని చెబుతున్నాయి. ఈ సీట్లలో ఎవరు గెలిచినా.. తక్కువ మార్జిన్ తో బయటపడే అవకాశాలున్నాయని సర్వేలు చెబుతున్నాయి. మరి బీజేపీ శ్రేణులు చెబుతున్నట్టు తెలంగాణలో డబుల్ డిజిట్ క్రాస్ చేస్తుందా అనేది చూడాలి.
ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సారి ఎన్నికల్లో బీజేపీకి ఖమ్మం పార్లమెంట్ స్థానంలో బీజేపీ గణనీయమైన ఓట్లు సాధించబోతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. కానీ 17 లోక్ సభ నియోజకవర్గాల్లో మహబూబా బాద్ స్థానంలో మాత్రం బీజేపీకి తక్కువ శాతం ఓట్లు పోలైనట్టు సర్వేలు ఘోషిస్తున్నాయి. అక్కడ బీజేపీకి 10 శాతం వరకే ఓటింగ్ మాత్రమే పోలైనట్టు ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. మరి నిజంగానే అక్కడి ఓటర్లు బీజేపీని తిరస్కారించారా లేదా అనేది తెలియాలంటే జూన్ 4 ఎన్నికల కౌంటింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే.
lso Read: Telangana Lok Sabha: తెలంగాణలో అనూహ్య ఫలితాలు.. కాంగ్రెస్‌కు బీజేపీ షాక్.. కారు షెడ్డుకే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter