Minister KTR Tweet: ప్రధాని మోదీ, ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీని టార్గెట్‌గా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేతలను దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ, ఐటీ టార్గెట్ చేయడం సాధారణమే..కానీ శ్రీలంక ప్రభుత్వ అధికారులు.. పవన విద్యుత్ కాంట్రాక్టులపై ప్రధాని మోదీని విమర్శిస్తే..దీనిపై ప్రధాని, అదానీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈమేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ విషయంలో మీడియా సైతం స్పందించడం లేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తోంది. ఈక్రమంలోనే మంత్రి కేటీఆర్ ట్వీట్ రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో సీఎం కేసీఆర్ సైతం..రాహుల్ గాంధీ అంశంపై పాజిటివ్‌గా మాట్లాడారు. ఇప్పుడు కేటీఆర్ ట్వీట్‌పై చర్చనీయాంశంగా మారింది.


పవన్‌ ప్లాంట్ కాంట్రాక్టు విషయంలో అదానీ గ్రూప్‌పై ఆరోపణలు వస్తున్నాయి. శ్రీలంకలోని మన్నార్ జిల్లాలో 500 మెగావాట్ల విండ్ పవర్ ప్లాంట్‌ నిర్మితమవుతోంది. ఈవిషయంలో ఎలాంటి పోటీ లేకుండా కాంట్రాక్ట్ అదానీ గ్రూప్‌నకు కట్టబెట్టాలని ప్రధాని మోదీ..శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సపై ఒత్తిడి తెచ్చారని ఆ దేశ విద్యుత్తు సంస్థ మాజీ అధ్యక్షుడు ఎంఎంసీ ఫెర్డినాండో వెల్లడించారు. ఇప్పుడా ఆ అంశం రాజకీయంగా దుమారం రేగుతోంది.



Also read: Srilankan Airlines: గగనతలంలో పైలట్ల అప్రమత్తత.. తప్పిన పెనుప్రమాదం..!


Also read:Congress Protest: కాంగ్రెస్ ఛలో రాజ్‌భవన్‌ ముట్టడి ఉద్రిక్తం..నేతల అరెస్ట్



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook